*భారతీయ వస్త్ర వైభవం…*
*ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో…*
*— నగరవాసులను ఆకర్షిస్తున్న వస్త్రాలు*
*— దేశంలోని వివిధ ప్రాంతాల వస్త్ర సాంప్రదాయం…*
*నగరంలో ఆవిష్కృతం…*
*18th to 23rd April 2025 ఎక్స్పో in *N lELLORE GRAND. MINI BYPASS Road.*

భారతీయ సాంప్రదాయ వస్త్రాల వైభవం నగరవాసులను అలరిస్తోంది. Minibypass రోడ్డులోని GPR GRAND 6 రోజులపాటు నిర్వహిస్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో దేశంలోనే వివిధ ప్రాంతాల సంప్రదాయాలను ఇష్టపడే మహిళలకు చక్కని అనుభూతిని కలిగిస్తోంది. రాష్ట్రాల నుంచి హస్త కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లతో ఈ ప్రదర్శన చేస్తోంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వస్త్ర తయారీలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.
భారతదేశం అనేది హస్తతంత్రం (హ్యాండ్లూమ్) రంగానికి తల్లి వంటి దేశం. మనదేశంలో ప్రతి రాష్ట్రానికీ తనకంటూ ప్రత్యేకమైన కాటన్, సిల్క్ వస్త్ర సంప్రదాయాలు ఉన్నాయి. ఈ వస్త్రాల్లో ప్రతి చుక్క కూడా ఒక కళాఖండమే. వీటి వెనుక ఉన్న శ్రమ, శైలీ, సంస్కృతి మన సంప్రదాయాల సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాడ, ధర్మవరం వస్త్రాలకు తెలుగునాట వివాహాల్ని అలంకరించే ఈ శుభ వస్త్రం అనే పేరు ఉంది. మెత్తనైన మట్టిసిల్క్‌తో తయారవుతుంది. మృదువైన గోధుమరంగు ఆధారంగా ప్రకృతి రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
ధర్మవరం సిల్క్ తో మందమైన రేశంతో రూపొందించే ఈ పట్టు చీరలు, పల్లూలో బంగారు జరీ వర్క్‌తో ప్రత్యేకత పొందాయి. తమిళనాడు కాంచీ పట్టు
భారతదేశపు అత్యంత ఖ్యాతిగాంచిన పట్టు చీరల్లో ఒకటి. బంగారు జరీ బోర్డర్‌లు, దేవతా ఆలయాల ప్రేరణతో రూపొందే బుటా డిజైన్లు దీన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుతాయి.
కర్ణాటక రాష్ట్రం మైసూర్ సిల్క్ వస్త్రాలకు ఉండే ప్రత్యేకత మహిళా మణులందరికీ తెలుసు.
మృదువైన తేనెరంగు నేపథ్యంతో, సున్నితమైన నూలుతో తయారయ్యే మైసూర్ సిల్క్ చీరలు చాలా తేలికగా ఉండి, సంప్రదాయ-ఆధునిక రూపాల్లో అందుబాటులో ఉంటాయి. మన పురుగునే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలోని గద్వాల్, పోచంపల్లి వస్త్రాలు కూడా శరీరం కాటన్, పట్టు బోర్డర్‌ల మేళవింపుతో ఆలయాలలో దేవతలకు సమర్పించే వస్త్రంగా వీటికి ప్రత్యేక స్థానం ఉంది.
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. డై-అండ్-వీవ్ పద్ధతిలో రంగుల మేళవింపుతో రూపొందే ఈ చీరలు దేశవ్యాప్తంగా పేరుగాంచాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి – బాలుచరి, తాంతి సిల్క్ వస్త్రాలు పురాణ గాథలను డిజైన్‌ల రూపంలో చీరపై అద్దే ఈ చీరలు కళా వైభవానికి ప్రతీక. ఇదే రాష్ట్రంలోని హస్త కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న
తాంతి సిల్క్ వస్త్రాలు తేలికపాటి, గోధుమ రంగులో ఉండే ఈ చీరలు వేసవి కాలానికి చక్కటి ఎంపికగా మహిళలు భావిస్తుంటారు. ఒడిశా రాష్ట్రంలోని సంభల్పురి ఇక్కత్ సైతం
సున్నితమైన చిత్తడితో, జ్యామితీయ ఆకారాల కలయికతో ప్రసిద్ధమైన ఈ చీరలు గర్భితమైన సాంప్రదాయాన్ని చాటుతాయి.ఉత్తర దేశంలోని బెనారసీ సిల్క్ వారణాసిలో తయారయ్యే బెనారసీ చీరలు రాజసంగా, శ్రీవిభవంగా ఉంటాయి. పెళ్లిళ్లకు ఆవశ్యకమైన అగ్రగణ్య వస్త్రాలివి. ఇటువంటి అద్భుతమైన వస్త్రాలు నగరవాసులకు అందుబాటులోకి రావడం నగర పేరు ప్రతిష్టలు జాతీయస్థాయిలో ఇనుమడింప చేస్తాయని ఎక్స్ పోను ఆయన సందర్శించి ఎక్స్పోలో ఉన్న స్టాల్స్ లో వస్త్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ
హస్తతంత్ర వస్త్రాలు కేవలం దుస్తులు మాత్రమే కావని, అవి మన సంస్కృతికి, చరిత్రకు, మహిళల కళాసక్తికి ప్రతిరూపాలన్నారు. స్థానిక కార్మికుల కృషిని గుర్తించి, ఇలాంటి వస్త్రాలను మద్దతు ఇవ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్స్పో ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరొక మూడు రోజులపాటు ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. ఈ ప్రదర్శనకు నగరవాసులు పెద్ద సంఖ్యలో రావడం భారతీయ సాంప్రదాయ వస్త్రాలపై మహిళలకు ఉన్న మక్కువను తెలియజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సిల్క్ మార్క్ ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రదర్శన వస్త్ర కొనుగోలుకు దోహదపడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *