
*అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన పట్టాభిరామిరెడ్డి*
🔸*నెల్లూరు అంటేనే ఒక వైభవం.. ఆ వైభవానికి మకుటంలా మన నగరంలో వెలిసింది ఈ అయోధ్య రామ మందిరం*
🔸*నెల్లూరు సిటీ హిస్టరీలోనే ఎవరూ సాహసించని విధంగా, అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు* .
🔸 *ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం* .
🔸*సిటీ ప్రజలు ఇప్పటివరకు ఇలాంటి భారీ సెట్టింగ్‌ను కేవలం సినిమాల్లోనో లేదా మెట్రో సిటీల్లోనో చూశారు, కానీ*
🔸*మొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీనిని ఆవిష్కరించారు* .
🔸*అచ్చం అయోధ్యలోని రామ మందిరం ఎలా ఉంటుందో, అదే అనుభూతిని ఇవ్వడానికి 100 మంది ప్రసిద్ధ కళాకారులు సుమారు 2 నెలల పాటు పగలు రేయి శ్రమించి ఈ భారీ మందిర నమూనాను నిర్మించారు* .
🔸*ప్రతి పిల్లర్, ప్రతి గోపురం అయోధ్య అసలు ఆలయాన్ని ప్రతిబింబించేలా కోట్లాది రూపాయల వ్యయంతో ఈ సెట్టింగ్ వేశారు* .
🔸*అయోధ్య రామ మందిర దర్శనాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు* .
🔸*ఆ రామయ్యను కళ్లారా చూసుకునే భాగ్యాన్ని నెల్లూరు వాసులకు కల్పిస్తున్నారు అని తెలియజేసారు* .
*ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్ డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ 14వ డివిజన్ కార్పొరేటర్ కర్త ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రంగనాయకుల దేవస్థానం చైర్మన్ లెక్కల ఎంక రెడ్డి గారు పాల్గొన్నారు* ….