*” కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు”- నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*.
*106వ రాజ్యాంగ సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్*
తేది:18-04-2026
విఆర్సీ సెంటర్, నెల్లూరు (జన హుషార్ న్యూస్)
——————–
*రాజకీయ లబ్ది కోసం బిజెపి పార్టీ ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో, నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాలభిషేకం నిర్వహించి, నివాళులర్పించిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*
నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్:
బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయకుండా, ఉభయ సభల్లో మెజారిటీతో సంబంధం లేకుండా, 2/3 వ వంతు మద్దతు ఉంటేనే రాజ్యాంగ సవరణ సాధ్యపడేటట్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆనాడే ఆలోచన చేశారు.
బిజెపి పార్టీ నియంతృత్వ ధోరణికి ఇది ఒక చెంపపట్టు లాంటిది.
బిజెపి నాయకులు, కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు వ్యతిరేకమని దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదం. 2023న 106వ రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కు గెజిట్ విడుదల చేసినా, జనగణనను సాకుగా చూపుతూ, బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదు. నేటికి జన గణన పూర్తి కాకపోయినా, తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లుకు డిలిమిటేషన్ బిల్లును జతకట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలని ప్రధాని మోడీ చూశారు. మహిళలను చట్టసభల్లో తీసుకొని రావాలని బిజెపి పార్టీకి ఏనాడూ ఆలోచన చేయలేదు.
స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీలలో 33% మహిళా రిజర్వేషన్ ను తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలను ప్రధాన మంత్రులుగా, మంత్రులుగా, దేశాధినేతలుగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బిజెపి రాజకీయ లబ్ధి కోసం కొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపింది.
<span;><span;>- *రాష్ట్రంలో బిజెపి పార్టీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీ….*
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, కేంద్రంలో మాత్రం మోడీకి మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం పార్లమెంట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏనాడూ మాట్లాడిన సందర్భం లేదు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు, దురుద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం.
లోక్ సభలో బిజెపి ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం రాజ్యాంగ గెలుపుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
బిజెపి మతతత్వంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
జనగణనతో సంబంధం లేకుండా, 2023న 106 వ రాజ్యాంగ సవరణ ద్వారా వంద శాతం ఆమోదం పొందిన చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
తేది:18-04-2026
విఆర్సీ సెంటర్, నెల్లూరు