*జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్.బి.ఐ బ్యాంకు సౌజన్యంతో చలివేoద్రం, సిమెంటు బెంచీలు ప్రారంభo*

నెల్లూరు ఏప్రిల్ 18 జన హుషార్ న్యూస్

ఎండలు అధికమవుతున్న కారణంగా ఎండవేడికి కోర్టుకు వచ్చే ప్రజలకోసం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేష్ రెడ్డి, పరిపాలన న్యాయముర్తి జి.శ్రీనివాస్, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ పి.మురళీనాయక్ ల చేతులమీదుగా ఎస్బిఐ బ్యాంక్ సౌజన్యంతో చలివేoద్రం మరియు ప్రజలు కూర్చోవడానికి 30 సిమెంటు బెంచీలు కోర్టు ప్రాంగణంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంక్ ఆర్.ఎం. మురళి నాయక్ మాట్లాడుతూ ఈ రోజున కోర్టు ప్రాంగణంలో ఎస్బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా చలివెంద్రం మరియు సిమెంటు బెంచీలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియచేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎస్బిఐ బ్యాంక్ వారు చేయడం పరిపాటేనని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వాటిని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రారంబిoచిన హైకోర్టు న్యాయ మూర్తికి, జిల్లా జాయింట్ కలెక్టర్ కి, జిల్లా ఎస్పీ,జిల్లా న్యాయమూర్తులకు, న్యాయస్థానం సిబ్బందికి అందరికీ ఎస్బిఐ బ్యాంక్ తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ చీఫ్ మేనేజర్ ఉదయ్ కృష్ణ, బ్యాంకు మేనేజర్ పి రాజేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *