
*రక్తదానంతో మరొకరికి పునర్జన్మ*
– నా పుట్టిన రోజున సామాజిన సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం
– జిపిఆర్ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జి.పి.ఆర్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు రక్తదాన శిబిర నిర్వాహకులు గుడి హరికుమార్ రెడ్డి గారిని అభినందించారు. రక్తదానం చేసినవారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నా పుట్టిన రోజున ఆడంబరాలకు దూరంగా.. హరికుమార్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. క్యాంప్‌లో పాల్గొన్న నారాయణ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్, నోవా, ప్రభుత్వ ఆసుపత్రివారికి కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం అనేది ప్రాణాన్ని కాపాడే గొప్ప కార్యం. మనం ఇచ్చే రక్తం.. మరో ముగ్గురి జీవితాన్ని నిలబెడుతుందన్నారు. గత సంవత్సరం ఇదే రోజున తన పుట్టిన రోజున జరిగిన బ్లడ్ క్యాంపులో దాదాపు 1500 యూనిట్లు రక్తదానం చేశారన్నారు. అవి కొన్ని నెలల వరకు ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపు 750 యూనిట్లు సేకరించనున్నారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ దాతలిచ్చే ఒక బాటిల్ రక్తం ప్రమాద బాధితులకు, ప్రసవ సమయంలో తల్లులకు, తలాసీమియా మరియు క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇడ్తుందన్నారు. రక్తదానం చేస్తే బలహీనపడతామనేది అపోహ మాత్రమేనని రక్తం ఇచ్చిన వెంటనే శరీరం కొత్త రక్త కణాలను వేగంగా ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల దాతలు మరింత చురుగ్గా మారుతారన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. నోవా బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ మరియు జి.జి.హెచ్ బ్లడ్ బ్యాంక్ బృందాలు రక్త సేకరణలో పాల్గొన్నాయి.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు రక్తదాతలను ప్రత్యేక్షంగా కలిసి, వారిని అభినందించారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు గుడి హరికుమార్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.