*వెల్లువెత్తిన ఆనందం.. ఉప్పొంగిన అభిమానం*
*పండుగలా విపిఆర్‌ జన్మదిన వేడుకలు*

– అభిమాన నాయకుడికి అభినందనల వెల్లువ.
– విపిఆర్ క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
– జై విపిఆర్‌ నినాదాలతో మార్మోగిన ప్రాంగణం
– కేక్‌ కటింగులతో, గజ మాలలతో విపిఆర్‌ దంపతులకు సన్మానాలు

దానగుణ సంపన్నులు, జిల్లా అభివృద్ధి సాధకులు, పేద ప్రజల ఆశాజ్యోతి.. ​నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఎంపికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో నెల్లూరులోని విపిఆర్ క్యాంప్ కార్యాలయం జనసందోహంగా మారింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర మేయర్‌ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జడ్పీ ఛైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులు రెడ్డి, జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ వంటివారితో పాటు ఇతర ప్రముఖులు, వివిధ అసోసియేషన్‌ ప్రతినిధులు విపిఆర్ గారిని కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

నెల్లూరు సిటీ, రూరల్‌, ​ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు మరియు కోవూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో కార్యాలయం ప్రాంగణమంతా జై విపిఆర్‌, విపిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో దద్దరిల్లింది. కేవలం రాజకీయ నేతలే కాకుండా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు స్వయంగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, వేమిరెడ్డి గారికి ఆశీర్వచనాలు అందజేశారు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, అభిమానుల కోలాహలంతో విపిఆర్ క్యాంప్ కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్నితలపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed