*విపిఆర్ పుట్టిన రోజున మహిళా సాధికారతకు పెద్దపీట*

– కోవూరు మహిళలకు కుట్టు మిషన్లను, తోపుడు బండ్ల పంపిణి
– స్వయం ఉపాధితో కుటుంబాలకు ఊతం
– హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు.. విపిఆర్‌ చల్లగా ఉండాలని ఆకాంక్ష

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలోనూ, సమాజ సేవలోనూ తమదైన ముద్ర వేసిన వేమిరెడ్డి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నెల్లూరు నగరంలోని విపిఆర్ గారి నూతన క్యాంప్ కార్యాలయంలో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళకు స్వయం ఉపాధి కల్పించే దిశగా వేమిరెడ్డి దంపతులు ఈ వేడుకలను మహిళా సాధికారతకు వేదికగా మార్చారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని 110 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లను అందజేశారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే 17 మంది పేదలకు తోపుడు బండ్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల చేతుల మీదుగా అందచేశారు. నిరుపేదల కష్టాలను గుర్తించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ఉపాధి కల్పించిన వేమిరెడ్డి దంపతులకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియచేసారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా జన్మదిన వేడుకలను నిర్వహించడమే కాకుండా మహిళా సాధికారతే లక్ష్యంగా తమ దాతృత్వాన్ని చాటుకున్న వేమిరెడ్డి దంపతుల సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed