21.04.2026
నెల్లూరు

– *కూట‌మి పాల‌న‌లో ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులు*

– *హ‌క్కుల కోసం పోరాడినా ఈ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోతోంది*
: వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ *ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఫైర్‌..*

నెల్లూరు లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

– కాకర్ల వెంక‌ట్రామిరెడ్డి డిస్మిస్ ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట‌
– ఉద్యోగులంతా ఈ చ‌ర్య‌ను ఖండించ‌క‌పోతే భ‌విష్యత్తులో వారికే న‌ష్టం
– ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదే
– హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపిస్తున్నాడు
– ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా వేధిస్తున్నాడు
– కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల ఉద్యోగాలు పీకేశాడు
: స‌్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

నెల్లూరు:

చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి పాల‌న‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులుగా మిగిలిపోయింద‌ని, హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపించ‌డ‌మే కాకుండా వాటి గురించి ప్ర‌శ్నిస్తున్న వారిని కేసుల‌తో చంద్ర‌బాబు వేధిస్తున్నాడ‌ని వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసిన కాకర్ల వెంక‌ట్రామిరెడ్డిని డిస్మిస్ చేయ‌డం ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డి ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచించారు. లేదంటే రాబోయే వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో ఇవే విధానాలు కొన‌సాగితే చాలామంది న‌ష్ట‌పోతార‌ని హెచ్చ‌రించారు. ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదేన‌ని, బీజేపీకి అనుకూలంగా చేసిన న‌వ నిర్మాణ దీక్ష‌ల‌కు, వ్య‌తిరేకంగా చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ఉద్యోగుల‌ను ప‌క్క‌నే పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగులు స‌హా వేల‌మందిని చంద్ర‌బాబు వేధిస్తున్నాడని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక క‌నీసం ఒక్క‌ కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించాడ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed