
*నా ఇంటి ఆడపడుచులకు సారె అందిస్తున్నా*
– మహిళా ఉద్యోగినుల మధ్య ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
– మహిళలకు విపిఆర్ ఆత్మీయ పలకరింపు
– సీఎం చంద్రబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గార్ల జన్మదినం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ‘సారె’.
– ప్రజా సేవ చేయాలనే సంకల్పానికి అధికారం తోడైతే ప్రజలకు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయవచ్చు.
– నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు కోవూరు నియోజకవర్గవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా ఉద్యోగినులు తరలివచ్చి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఎంపీ వేమిరెడ్డి కేక్ కట్ చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని శానిటేషన్, అంగన్వాడీ, మెడికల్, రెవెన్యూ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి అన్ని శాఖల మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల నుండి తహసీల్దార్ల వరకు, ఆశా వర్కర్ల నుండి వైద్యుల వరకు అందరూ ఒకే వేదికపైకి రావడం విశేషం. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి మహిళా ఉద్యోగినికి ‘సారె’ అందజేసి తన సోదరభావం చాటుకున్నారు. 20న సీఎం చంద్రబాబు గారి జన్మదినం ఉన్న నేపధ్యంలో ప్రతి మహిళను గౌరవిస్తూ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక తన పుట్టినరోజును ఇంత మంది అక్కచెల్లెళ్ల మధ్య, ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సేవ చేయాలనే సంకల్పానికి అధికారం తోడైతే ప్రజలకు చేరువై మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇకపై ప్రతి ఏటా నా జన్మదిన వేడుకలను ఇలాగే మహిళా ఉద్యోగినుల మధ్య జరుపుకుంటానన్నారు.
*రేపటి నుంచి కోవూరులో విపిఆర్ నేత్ర సేవలు ప్రారంభం*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రేపటి నుండి కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి గారు ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నుండి ఉదయగిరిలో సుమారు 40 వేల మందికి ఉచిత కంటి పరీక్షలు చేసి 22 వేల మందికి పైగా కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందివ్వాలన్న లేటెస్ట్ ఎక్యూప్మెంట్ వున్న రెండో మొబైల్ బస్సును కోవూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. కోవూరు ప్రజలు విపిఆర్ నేత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. తానూ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు చేరువై సేవ చేయగలుగుతున్నానంటే దానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారమే కారణమన్నారు. ఇంటిని, ఆఫీసును సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణ పట్ల మహిళా ఉద్యోగినుల అంకితభావం స్ఫూర్తి దాయకమన్నారు. ఎంపీ వేమిరెడ్డి గారు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని అక్కడికి విచ్చేసిన మహిళలు ఆకాంక్షించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వివిధ శాఖల మహిళా ఉద్యోగినులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అభినందనలు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగినులకు ఆత్మీయ ఆతిధ్యం యిచ్చి సారెలతో చిరు సత్కారం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.