
SPS నెల్లూరు జిల్లా,
*నిఘా నీడలో, పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి స్ఫూర్తి మరియు ఉత్సవ ర్యాలీలు – జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS.,*
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు నెల్లూరు పట్టణంలో నిర్వహించిన స్ఫూర్తి, ఉత్సవ ర్యాలీలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినాయి.
జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS., గారు ముందస్తుగా పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై స్పష్టమైన సూచనలు జారీ, ర్యాలీ నిర్వహణను నిరంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి అధికారుల పర్యవేక్షణ.
జిల్లా యస్.పి గారు నెల్లూరు టౌన్ మరియు కావలి రూరల్, గూడూరు, కోట మొదలుగు టౌన్స్ జరిగిన శివాజీ జయంతి ర్యాలీ లో ఎలాంటి అవంచనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించాలి అని పోలీస్ అధికారులకు
స్పష్టమైన ముందస్తు సూచనలు.
నెల్లూరు టౌన్ ర్యాలీలు VRC సెంటర్ నుండి ప్రారంభమై కనకమహాల్ వరకు వెళ్లి, గాంధీబొమ్మ మీదుగా తిరిగి VRC గ్రౌండ్‌కు చేరుకున్నాయి.
ర్యాలీ మార్గమంతా డ్రోన్లు, సీసీటీవీల ద్వారా నిఘా ఏర్పాటు చేయబడింది.
నెల్లూరు టౌన్ ర్యాలీలు SDPO Town, ASP శ్రీమతి దీక్ష IPS గారి నేత్రుత్వం లో
చినబాజర్, సంతపేట, ట్రాఫిక్ మరియు విమెన్. పియస్ ఇన్స్పెకర్స్ వారి బందోబస్త్ సిబ్బంది, స్పెషల్ పార్టీ లు, డ్రోన్ టీంలు అడిషనల్ యస్. పి శ్రీమతి Ch సౌజన్య గారి సూచనలు మేరకు సమన్వయంతో విధులు నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయడం జరిగింది.
కావలి రూరల్, గూడూరు, కోట పట్టణాల్లో కూడా ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయి.
సహకరించిన నిర్వాహకులు, భక్తులు, ప్రజలకు జిల్లా పోలీసు శాఖ ధన్యవాదాలు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.19.02.2026.