
SPS నెల్లూరు జిల్లా
*జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
• జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
• అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాలు సహా అన్ని ప్రధాన శివాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు.
• భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహణ.
• ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా.
• డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి Ch సౌజన్య గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు ప్రధాన శివాలయాల పోలీస్ కంట్రోల్ రూమ్స్ లింక్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.
• రాత్రి జాగరణ కార్యక్రమాల సమయంలో కూడా అదనపు బందోబస్తు కొనసాగింపు.
▪️సాంస్కృతిక ప్రోగ్రాం ల వద్ద
అప్రమత్తం గా ఉండాలి. ఇలాంటి అసభ్యతకు తావు లేకుండా చూసుకోవాలి.
▪️ ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా ఇలాంటి అవాంచిత ఘటనలు జరగ కుండా చూసుకోవాలి.
• పోలీసులకు సహకరించిన భక్తులకు, అన్ని విభాగాల వారికి కృతజ్ఞతలు.
• విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు.
• జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.15.02.2026.