*నెల్లూరు జిల్లా…*

*నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…*

*💥అరాచకం పరాకాష్టకు చేరింది💥*

*👉నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్..సంపద సృష్టి పేరుతో స్కాం లు చేస్తున్నారు*

జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుండి పుట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికలకు ముందు గౌరవ వేతనం 5 వేల నుండి 10 వేలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వున్న 2లక్షల పైన వాలంటీర్ లను తొలగించారు…

విజయవాడ వరదల సమయంలో ప్రజలు అందరూ వాలంటీర్ లను తలచుకున్నారు…

వాలంటీర్ ఇంచార్జ్ గా నాగార్జున ను నియమించారు,వెంకటగిరి లోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టాం..

జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కు పెద్దపీట వేస్తాం అన్నారు…

వెంకటగిరి నియోజక వర్గంలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూస్తూ ఉన్నా

పోలీసు స్టేషన్ లోనే కేసులు విచారణ తీర్పు లు జరుగుతున్నాయి…

వెంకటగిరి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం పెట్టిన కూటమి నేతలు ఓడిపోయారు.

వెంకటగిరి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములు లాక్కోవడం,ఇసుక కనిపిస్తే దోచుకోవడం పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు..

కలువాయి మండలం తెలుగురాయపురం,రాజుపాలెం వద్ద అక్రమంగా ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి రోడ్లు వేసి ఇసుక తరలిస్తూనే ఉన్నారు,అధికారులకు చెబితే తూతూ మంత్రం గా తనిఖీలు చేపట్టడం తప్ప చర్యలు లేవు…

ఎంత దారుణం అంటే అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్ రోడ్డులో ఆగిపోతే ఆ విద్యార్ధులు నడుచుకుంటూ వెళ్లారు..

అక్రమార్కులు భయపడే రోజులు పోయాయి, అధికారులు,ప్రభుత్వం ఏమి చేస్తున్నావు…

అక్రమ ఇసుక మొత్తం బెంగుళూరుకు తరలిస్తున్నారు…

సైదాపురం లో క్వార్జ్ అక్రమ మైనింగ్ పై ఓ సినిమా తీయొచ్చు…

అధికారికంగా మైన్స్ ఉన్న వారిని బెదిరించి 50 శాతం వాటా మాకే ఇవ్వాలి అంటూ మైన్ లు మొత్తం తమకే ఇస్తే వ్యాపారం చేసి వచ్చిన దానిలో 50 శాతం ఇస్తా అంటున్నారు..

ఫిని క్వార్జ్ ప్రైవేటు లిమిటెడ్..జనవరి 25, 2025 లో 5 మంది డైరెక్టర్ లుగా మన్నెమాల విజయ కుమార్ రెడ్డి MD గా మేకా రవీంద్ర బాబు,ముళ్ళపూడి ప్రభాకర్ రావు,వీర్రాజు మావూరి , డైరెక్టర్ లు గా ఒక కంపెనీ స్థాపించారు

నాలుగు నెలల ముందు స్థాపించిన ఫిని క్వార్జ్ కంపెనీ ఒక్కటే క్వార్జ్ ఖనిజం మొత్తం ఎగుమతులు చేస్తుంది,మరి ఎన్నో సంవత్సరాలుగా వున్న కంపెనీలు మాత్రం మూత బడిపోయాయి..

మేం అధికారం లోకి వస్తె ఈ కంపెనీ అక్రమ వ్యవహారాలు అన్ని బయటకు తీస్తాం..

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతూ అరాచక శక్తులు విజిలెన్స్ అధికారులు గా వ్యవహరిస్తున్నారు…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు,అడవుల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే మాట్లాడరా?కాకినాడ లో సీజ్ ద షిప్ అన్న పవన్ సైదాపురం లో జరుగుతున్న అక్రమ మైన్ పై మాట్లాడాలి

రౌడీ షీటర్ లతో అక్రమ మైన్ లు నడిపిస్తున్నారు..

అక్రమ మైనింగ్ చేస్తే అనుమతులు అవసరం లేదు,అక్రమ ఇసుక తరలిస్తుంటే అనుమతులు అవసరం లేదు,కానీ అక్రమ మైన్ లు సందర్శకోసం వెళుతున్న వైసిపి నాయకులను మాత్రం అనుమతులు తీసుకోవాలని పోలీసులు అడ్డుకుంటారు…

అక్రమ వ్యవహారాలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళతాం….

కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి తో వురసా కంపెనీకి 60 ఎకరాలు ఇవ్వడం ఏంటి?..

సంపద సృష్టి అంటే రాష్ట్రం లో అన్ని వనరులు దోచుకోవడమేనా..

ప్రధాన మంత్రి సభలో లోకేష్ స్టేజ్ మీద ఎందుకు కూర్చున్నారో?

సంక్షేమ పథకాలు అమలు చేయకుండానేగతం లో కంటే ఎక్కువ అప్పులు చేశారు,ఆ డబ్బులు ఎక్కడకు పోయాయే

అమరావతి రాజధాని అనేది పెద్ద

కూటమి ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రం అధికారం లో ఉంటుంది 2027 లో జమిలి ఎన్నికలు వస్తాయి వైసిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించబోతుంది ఇది పక్కా…

ఈ కార్యక్రమం లో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తో పాటు సైదాపురం మండల కన్వీనర్ మనరపు రవి, వైసిపి నాయకులు ప్రభాకర్ రెడ్డి,రాపూరు మండల కన్వీనర్ మధురెడ్డి , కలువాయి మండల కన్వినర్ కృష్ణా రెడ్డి,
నారాయణ రెడ్డి , శ్రీనివాసులరాజు మరి కొంతమంది మండల నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed