*హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ ఆదేశాలు పాటించరు*
*విజిలెన్స్ అధికారుల నివేదికను అమలు చేయరు .. హౌసింగ్ ఎండి కి,*
*హౌసింగ్.జిల్లా మేనేజర్ మురళికి బిజెపి నేత మిడతల రమేష్ ఫిర్యాదు*

నెల్లూరు జిల్లాలో హౌసింగ్ అధికారుల తీరు వలన బిజెపి హౌసింగ్ కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి అప్పుల ఊబిలో కూరుకు పోయారు. తాను కష్టపడి సంపాదించింది అధికారులుతనచేతికి అందకుండా వేధించారు.
ఆప్షన్ త్రీ కింద లబ్ధిదారుల ఖాతాలో జమైన డబ్బులు అధికారులువసూలు చేసి కాంట్రాక్టర్లకు 9_8_2023 అందించమని *ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ ఆదేశాలు* ఇచ్చారు. నెల్లూరు సిటీలో మాత్రం ఆదేశాలను హౌసింగ్ అధికారులు గౌరవించలేదు. లబ్ధిదారుల వద్ద సుబ్బారెడ్డి కాంట్రాక్టర్కు కోటి 70 లక్షలు పెండింగ్లోనే ఉండిపోయాయి. అవి వసులయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

బిజెపి కాంట్రాక్టర్ నిర్మించిన 150 గృహాలు ను అప్పటి హౌసింగ్ డిఈ పనిచేయని కాంట్రాక్టర్ లకు ట్యాగ్ చేసి ఆ నిధులు స్వాహా చేసి పంచుకున్నారు .
ఈ అవినీతిపై విజిలెన్స్ డిఈ చంద్రశేఖర్ రాజు విచారణ జరిపి నివేదికను ప్రూవ్ చేశారు. ఆ అవినీతిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్ అడ్డుకుంది.
ప్రస్తుత పాలకులు ఈ అవినీతికి మద్దతిస్తున్నారు.. హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం అవినీతి వలన సుబ్బారెడ్డి కాంట్రాక్టర్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. ఈ పాలకుల అధికారుల వైఖరి మూలంగా పెండింగ్ బకాయిల వలన బిజెపి కాంట్రాక్టర్ జీవితం బలికాకుండా ఉండేందుకు ప్రత్యక్ష ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed