
*హైకోర్టు తీర్పు మేరకు భవనములోని అనధికార నిర్మాణాలను తొలగిస్తున్నట్లు తెలియజేసిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని గుప్తా పార్కు ప్రాంతం సవరాల వీధిలో పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలను అతిక్రమించి అదనంగా ఒక అంతస్తు నిర్మాణం ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవనంలోని అనధికార నిర్మాణాలను కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శుక్రవారం టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గౌరవ హైకోర్టు తీర్పు మేరకు భవనంలోని అనధికార నిర్మాణాల తొలగింపుకు పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో చర్యలను చేపట్టామని కమిషనర్ తెలిపారు.
నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా ఎలాంటి అనధికార నిర్మాణాలు, అనుమతులు అతిక్రమించి కట్టడాలు చేపట్టరాదని, తప్పనిసరిగా వాటిని తొలగించి వేస్తామని కమిషనర్ సందర్భంగా తెలియజేశారు.