
SPS నెల్లూరు జిల్లా,
*హెల్మెట్ ధారణపై స్వయంగా అవగాహన కల్పించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS.,*
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నెల్లూరు నగరంలోని KVR పెట్రోల్ బంకు సమీపంలో, జిల్లా యస్.పి. గారి ఆధ్వర్యంలో, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు మరియు ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో రోడ్డు సేఫ్టీ లో భాగంగా హెల్మెట్ దారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు నెల్లూరు జిల్లా ప్రజలను ఉద్దేశించి హెల్మెట్ దారణ ఆవశ్యకత, స్పీడ్ డ్రైవింగ్, మైనర్స్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్ మొదలగు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన మరియు వాటి వలన కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించి, *ఎవరైతే హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేస్తున్న వారికీ గులాబీ పూలు అందించి అభినందనలు తెలిపారు.
అదే విధంగా హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్న వారికీ హెల్మెట్ అందించి తప్పనిసరిగా బైక్ రైడింగ్ సమయంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి అని చూచించారు.*
హెల్మెట్‌ను శిరోధార్యంగా భావించి ధరిస్తే ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని జిల్లా యస్.పి. గారు సూచించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు.
ప్రజల ప్రాణాలు, భద్రతే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధారణపై స్పెషల్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హెల్మెట్ ధారణతో పాటు ఓవర్ స్పీడింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, మైనర్స్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నెల్లూరు సిటీ మరియు జిల్లా వ్యాప్తంగా బైక్ రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.
హెల్మెట్ ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు.
కుటుంబ సభ్యులపై బాధ్యత గుర్తించి ప్రామాణికత కలిగిన హెల్మెట్లు ధరించాలని, కారుల్లో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని హెచ్చరించారు.
అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని స్పష్టం చేశారు.
హెల్మెట్ ధరించని వాహనదారులపై MV Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుని ఈ-చలానాల ద్వారా జరిమానాలు విధిస్తామని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కింది విషయాలు నొక్కి ఒక్కనించారు.
రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
ఎటువంటి ర్యాష్, నెగ్లెక్ట్ డ్రైవింగ్ చేయకుండా ప్రయాణించాలి.
హైవే మీద ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి..
డ్రంక్ & డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు..
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించుకోవడానికి అందరూ సహకరించాలి..
ఒక మనిషి వారి కుటుంబానికి ఎంతో ముఖ్యం.. వారు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కుటుంబ సభ్యులు ఎంతో వ్యధకు గురవుతారని తెలిపారు.
చివరిగా రాబోయే రోజులలో రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన సదస్సులు ఇంకా విస్తృతం చేస్తామని అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యస్.పి. గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.27.12.2025.