*హత్య కేసులో నిందితులను మరోసారి రోడ్లపై నడిపించిన నెల్లూరు పోలీసులు*

*రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో మిగిలిన నిందితుడు అరెస్ట్*

నెల్లూరు జిల్లా..

నెల్లూరు రూరల్ పరిధిలో జరిగిన కేసులో.. Crime No: 381/2025 U/s 191(2), 191 (3), 126(2), 103(1), 61(2), 49, 351(2) r/w 190 BNS, Sec 25 (1A) & 27 (1) Arms Act Sec 392) (V) Sc’s St’s Act of Nellore Rural PS కేసులో A.14 ముద్దాయి అయిన Arava Penchalaiah S/o Jagan @ jagandham, age 30 years, SC-Mala by caste, г/о H No 28.01.324, Old Check Post, Aravapalem, Bodigadi Thota, Nellore city అను అతనిని ఈ దినం నెల్లూరు రూరల్ పోలీస్ వారు ఆమంచర్ల బస్టాండ్ వద్ద అరెస్టు చేసి, నెల్లూరు టౌన్ నందు రూట్ మార్చ్ చేయించారు.

*👉 సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముంతాజ్ అనే మహిళ ఇంటిలో 20.9 కేజీల గంజాయి పట్టివేత*

నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వజెండ్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో నెల్లూరు నగర, రూరల్ పోలీస్ లు ఉమ్మడిగా సమన్వయంతో నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరాన్ని గంజాయి రహితంగా మార్చాలనే ఉద్దేశంతో గంజాయి పై ప్రత్యేక నిఘా ఉంచామని రాబడిన సమాచారం మేరకు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తో షేక్ ముంతాజ్ అనే మహిళ ఇంటిలో తనిఖీలు చేయు 20 కేజీల 900 గ్రాముల గంజాయి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. షేక్ ముంతాజ్ తో పాటు ఆమె ఇద్దరు కుమారులు షేక్ సిరాజ్, షేక్ జమీర్,ఆమె కోడలు సుభాషిని,చిన్న కొడుకు ఇలా కుటుంబంలోని 5 మంది గత 10 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారంలో ఉన్నారని గుర్తించామన్నారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని అదుపులోకి తీసుకుని తాసిల్దార్ సమక్షంలో ప్రవేశపెట్టి అరెస్టు చేశామని వీరు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి నగరంలో అనేకమందికి అమ్ముతున్నారని ఇలాంటి రైడ్ లు చేయడం ద్వారా నెల్లూరు నగరాన్ని, జిల్లాని గంజాయి రహితంగా మారుస్తామనీ గంజాయికి సంబంధించిన లేదా ఇతర నేరాలకు సంబంధించిన వివరాలను నగర ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన రివార్డులు కూడా ఇస్తామని రూరల్ డి.ఎస్.పి ఘట్టమనేనీ శ్రీనివాస్ రావు తెలియజేశారు….

ఇదే సమయంలో నెల్లూరు నగరం RDT కాలనీలో జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అరవ కామాక్షి సోదరుడిని మరి కొంతమందిని ఆమంచర్ల వద్ద అరెస్టు చేశామని దీంతో ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వారందరి అరెస్టు పూర్తయిందని వారిని నెల్లూరు నగరంలో ఊరేగింపుగా తీసుకువచ్చామనీ ఇకమీదట నెల్లూరు నగరం నేర రహితంగా మార్చుటమని డిఎస్పి తెలియజేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed