హత్య కేసును చేధించిన నవాబ్ పేట పోలీసులు- : టౌన్ డి.యస్.పి. శ్రీమతి పి.సింధుప్రియ
యేటి పండుగ సమయంలో జరిగిన వివాదమే హత్య ప్రధాన కారణం..
గాలి పటాలు ఎగరేస్తూ ప్రధాన నిందితుడుగా ఉన్న దోనిపర్తి అజయ్ కుమార్, మృతునితో గొడవ పడి ఒకరినొకరు చంపుతానని బెదిరింపులు..
మృతుడు తనని ఎక్కడ చంపుతాడోనని బయపడి, తన స్నేహితులతో కలిసి హత్యకు పథకం పన్నిన అజయ్ కుమార్..
ముగ్గురు రక్కీ నిర్వహించి, మరో ఐదు మంది వెళ్ళి ఉడ్ హౌస్ సంగం వద్ద మృతుడు కళ్యాణ్ ను హత్య చేసిన ముద్దాయిలు.
సమాచారం అందిన వెంటనే యస్.పి. గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జల్లెడ పట్టిన నవాబ్ పేట పోలీసులు.
ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి, హత్య చేయుటకు ఉపయోగించిన కత్తులు, 3 మోటార్ సైకిళ్ళు స్వాధీనం.
భవిష్యత్తులో ఎవరైన యిటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై చట్ట రీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరికలు..
అంతేకాకుండా అటువంటి వారిపై రౌడి షీట్స్ ఓపెన్ చేయడం మరియు PD యాక్ట్ కేసులు పెట్టడము జరుగును..
ప్రజలు ఎవరైనా ఇటువంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారము నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 0861 2328400 కు తెలిపిన యెడల అట్టి సమాచారాన్ని గోప్యంగా ఉంచబడును.
చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన నవాబ్ పేట పోలీసులను అభినందించిన టౌన్ DSP గారు.
కేసు నమోదు:
Cr.No.43/25 U/Sec 103(1) r/w 3(5) BNS (Sec.302 R/w 34 IPC) ఆఫ్ నవాబ్ పేట స్టేషన్, నెల్లూరు సిటీ.
ముద్దాయిల వివరములు:
1. దోనిపర్తి అజయ్ కుమార్ తండ్రి: రవి చంద్ర, వ. 25 సం”రాలు, సాలి కులం, జాకిర్ హుస్సేన్ నగర్, నెల్లూరు పట్టణం
2. మురుగన్ అజిత్ @ కుల్లా తండ్రి: మురగన్, వ.24 సం”రాలు, వన్నేకాపు కులం, మాన్సూర్ నగర్, నెల్లూరు పట్టణం
3. తచ్చంగౌడ్ శివ కుమార్ తండ్రి:కృష్ణ, వ.38 సం”రాలు, గౌడ కులం, భగత్‌సింగ్ కాలనీ, నెల్లూరు
4. అలిజింగ్ ఉదయకిరణ్ తండ్రి:పోలయ్య, వ.27 సం”రాలు, ఎస్.సి.మాదిగ కులం, కుసుమ హరిజనవాడ, నవాబ్‌పేట్
5. వింజమూరు సురేంద్ర @ సురి @ రాక్ తండ్రి:శ్రీనివాసులు, వ.21 సం”రాలు, పద్మశాలి కులం, సత్యనారాయణ పురం సెంటర్, కట్టమీధ, నెల్లూరు నగరం. స్వగ్రామం: కురిచర్లపాడు గ్రామం, వెంకటచలం, నెల్లూరు జిల్లా
6. కురుగుంట్ల పవన్ కుమార్ తండ్రి:లక్ష్మయ్య, వ. 27 సం”రాలు, ఎస్.సి.మాదిగ కులం, కంసాలి వీధి, ఆర్.ఆర్. ఫ్యామిలీ దబ్బా దగ్గర, స్టోన్ హౌస్‌పేట, నెల్లూరు పట్టణం
7. కొట్టె రమేష్, తండ్రి: వెంకటేశ్వర్లు, వయసు: 26 సంవత్సరాలు, కులం: బలిజ, బట్టిలవారి వీధి, సెట్టిగుంట రోడ్, నెల్లూరు. స్వగ్రామం: వుడ్ హౌస్ సంగం, నెల్లూరు
8. గణపం మనోజ్ కుమార్ తండ్రి : శ్రీనివాసులు వ. 25 సంవత్సరాలు, కులం: రెడ్డి , కిసాన్ నగర్, నెల్లూరు
మృతుడు: కోడూరు కళ్యాణ్ తండ్రి: రాజ, 25 సం”రాలు, యస్.సి.మాల కులం, ఉడ్ హౌస్ సంగం, నెల్లూరు పట్టణం
పిర్యాది పేరు: కోడూరు వెళా౦గిణి, భర్త: రాజ, 45 సం”రాలు, యస్.సి.మాల కులం, ఉడ్ హౌస్ సంగం, నెల్లూరు
కేసు వివరములు:
తేది:08.02.25 రాత్రి షుమారు 09.30 గంటలకు నెల్లూరు పట్టణ ఉడ్ హౌస్ సంగం ఏరియాకు చెందిన ఫిర్యాది కుమారుడిని గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపి పారిపోయినట్లు ఇచ్చిన రిపోర్టుపై నవాబ్ పేట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడమైనది.
కేసు చేధన:
ప్రత్యేక బృందంగా ఏర్పడి హత్య కేసును వెంటనే చేధించాలని జిల్లా యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్,IPS., గారి ఆదేశాల మేరకు, నెల్లూరు నగర డి.యస్.పి శ్రీమతి పి.సిందుప్రియ గారి నేతృత్వములో, నవాబుపేట సి.ఐ శ్రీ షేక్ అన్వర్ బాష గారు ఈ కేసును ప్రతిష్టాత్మకముగా తీసుకుని, యస్.ఐ లు: షేక్ రహిమాన్, కె.శివయ్య మరియు సిబ్బంది సహాయముతో దర్యాప్తు జరిపి, క్షుణ్ణంగా శోధించి తేది 12-02-2025 న ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
జరిగిన వృత్తాంతం:
తేదీ 16-01-25 న నెల్లూరు పెన్నా నదిలో జరిగిన యేటి పండుగ సందర్భముగా, గాలి పటాలు ఎగరేస్తూ మృతునితో గొడవ పడి మృతుని చేతిలో ప్రధాన నిందితుడుగా ఉన్న దోనిపర్తి అజయ్ కుమార్ దెబ్బలు తిన్నట్లు, ఆ సమయంలో ఇరువురు ఒకరినొకరు చంపుకొంటామని బెదిరించుకొన్నట్లు, ముద్దాయిని మృతుడు పలుమార్లు చంపుటకు అతనిని అనుసరిస్తున్నట్లు గమనించిన ప్రధాన ముద్దాయి తనని ఎక్కడ చంపుతాడోనని భయపడి తన స్నేహితులైన మిగతా ముద్డాయిలతో కలిసి పథకం ప్రకారం, తేది:08.02.25 రాత్రి 09.30 గంటలకు చివరి ముగ్గురు ముద్దాయిలు రెక్కి నిర్వహించగా, మొదటి అయిదు మంది ముద్దాయిలు రెండు మోటార్ సైకిళ్ళుపై వెళ్లి తమ వెంట తీసుకెళ్ళిన కత్తులతో మృతుడ్ని విచక్షణారహితంగా పొడిచి చంపి పారిపోయినట్లు నేరమును అంగీకరించినారు.
అంతట ముద్దాయిలను అరెస్టు చేసి, హత్య చేయుటకు ఉపయోగించిన కత్తులు, 3 మోటార్ సైకిళ్ళు స్వాధీనపరుచుకుని, ముద్దాయిలను రిమాండుకు తరలించడమయినది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న దోనిపర్తి అజయ్ కుమార్ తన చిన్న తనంలోనే హత్య కేసులో జైలు కెళ్ళి వచ్చినట్లు తెలిసినది.
పై కేసును చేధించుటలో ప్రతిభ కనబరిచిన నవాబ్ పేట సి.ఐ. శ్రీ షేక్ అన్వర్ బాష గారిని, యస్.ఐ లు: షేక్ రహిమాన్, కె.శివయ్య, వారి సిబ్బందిని జిల్లా యస్.పి. గారు మరియు డి.యస్.పి.గారు అభినందించడమైనది.
సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం,
నెల్లూరు టౌన్.