*స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా సింహపురి సింహం సి.హెచ్. రామ కృష్ణా రెడ్డికి ఘన నివాళి*

నెల్లూరు నగరంలోని ముత్తుకూరు బస్టాండ్, విఆర్సి సెంటర్ వద్ద బిజెపి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సి.హెచ్ రామకృష్ణారెడ్డి ఆశయాలను సాధించడమే మా లక్ష్యం అని బిజెపి జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. సింహపురి సింహం, ప్రజల కోసం సైనికుడిలా పనిచేసిన రామకృష్ణారెడ్డి దైవసమానమైన వ్యక్తి అని కొనియాడారు. “మహనీయుడిగా ప్రజల కోసం మార్గదర్శకుడిగా నిలిచిన రామకృష్ణారెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ, వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి” అని పేర్కొన్నారు.రామకృష్ణారెడ్డి జీవితం, సేవలు, ప్రజల పట్ల ఆయన చూపిన ఆత్మీయత అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని వంశీధర్ రెడ్డి తెలిపారు.

300 నిరు పేదలకు అన్నదానం చేయడం జరిగింది.”జోహార్ స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారు!” అంటూ జిల్లా ,మండల నాయకులు మరియు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఆటో యూనియన్ అధ్యక్షులు బాలకృష్ణ ,ముసునూరు సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర సెల్స్ ఇంచార్జ్ పి సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు, యారబోలు రాజేష్, గడ్డం విజయ్ కుమార్, యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శిలు,దాసరి ప్రసాద్, చిలకా ప్రవీణ్, నెల్లూరు రూరల్ కన్వీనర్ ఈశ్వరయ్య , ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ , ఉప ప్రసన్న, కిరణ్ , మహిళా మోర్చా నాయకులు కరణం సుభాషిని, ప్రవీణారెడ్డి, గంటా విజయ శ్రీ,, ఎస్టి మోర్చ అధ్యక్షుడు ప్రసాద్, మండల అధ్యక్షులు సుధీర్, పద్మ,మదన్, హర్ష శ్రీనివాసులు రెడ్డి, లెక్కల రాజశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్స్ ముని సురేష్, పిడుగు లోకేష్, సునీల్ రెడ్డి, మారం కృష్ణ, తిరకల శివ, గణేష్ కృష్ణమ్మ, నారాయణ, సత్యనారాయణ,రాధాకృష్ణారెడ్డి, తిరువీధి నారాయణ ,అవినాష్ నాయుడు, మస్తాన్ గౌడ్,జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *