*స్థిర నివాసం లేని వారు, సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటరు నమోదుకు అవకాశాలను పరిశీలించాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ( చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం117, రూరల్ నియోజకవర్గం 118 లకు సంబంధించిన ఈ.ఆర్.ఓ లు, అసిస్టెంట్ ఈ.ఆర్.ఓ లు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సిటీ నియోజకవర్గం 117 ఈ.ఆర్.ఓ వై.ఓ నందన్, రూరల్ నియోజకవర్గం 118 ఈ.ఆర్.ఓ అనూష లు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ సమావేశం పూర్తయిన అనంతరం ఈ.ఆర్.ఓ నందన్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా అందుకున్న అన్ని ఓటరు దరఖాస్తులను పారదర్శకంగా విచారించి అర్హులను గుర్తించాలని సూచించారు. అర్హులైన వారి నమోదుకు జాబితాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.

బి.ఎల్.ఓ లు తమ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరించాలని, కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదయ్యేలా జాగ్రత్తలు వహించాలని సూచించారు.

స్థిర నివాసం లేని వారు, సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటరు నమోదుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. దివ్యాంగులు, వయో వృద్దులను గుర్తించి వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని ఈ.ఆర్.ఓ సూచించారు.

క్షేత్ర స్థాయి సిబ్బంది సేకరించిన వివరాలను ఉన్నతాధికారులు పారదర్శకంగా పరిశీలించాలని, వివరాల పరిశీలనకు స్వయంగా గృహాలను సందర్శించి ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడాలని ఈ.ఆర్.ఓ సూచించారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

*నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *