
*స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత పనులను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
సండే మార్కెట్ ప్రాంతంలోని దుకాణాల నిర్వాహకులు ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలను డ్రైను కాలువలలో వేయడం ద్వారా తరచుగా మురుగునీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని, డ్రైను కాలువలలో వ్యర్ధాలు వేయకుండా చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకొని అనంతరం చెత్త తరలింపు వాహనాలకు మాత్రమే అందజేయాలని ఆదేశించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ ప్రతిరోజు చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దుకాణాలు మూయించి వేస్తామని కమిషనర్ సండే మార్కెట్ దుకాణాల అసోసియేషన్ సభ్యులను హెచ్చరించారు.
వరద నీరు రోడ్లపై చేరి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారకుండా ప్రవాహం సాఫీగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించా