
*సేవాభావం కలిగిన వ్యక్తి మాతూరు శ్రీనివాసులు రెడ్డి*
మాతూరు శీనన్న మృతి పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
విడవలూరు మండల కేంద్రంలో టిడిపి నాయకులు దివంగత మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారి బంధు మిత్రులు నిర్వహించిన సంస్మరణ సభ సందర్బంగా ఆమె మాతూరు శ్రీనివాసులు రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ మాతూరు శ్రీనివాసులు రెడ్డి చనిపోయే నాలుగు రోజుల ముందు తనను కలిసి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళడం కోసం లెటర్ అడిగిన విషయాన్ని చెబుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు భావోద్వేగానికి లోనయ్యారు.
శీనన్న మృతితో కోవూరు నియోజకవర్గం ఓ రైతు నాయకుడిని కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇంటి పెద్దను కోల్పోయి విషాదంలో వున్న శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం, ఓర్పు ప్రసాదించాలని ఆమె ప్రార్ధించారు.