*సూళ్లూరుపేట నియోజకవర్గంలో అర్హులందరికీ పక్కా ఇల్లు మంజూరు చేయాలి : బిజెపి నేతలు*
(జన హుషార్ న్యూస్ , నాయుడుపేట )
సూళ్లూరుపేట నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా పక్కా ఇల్లు మంజూరు చేయాలని నాయుడుపేట బిజెపి నాయకులు అన్నారు.
శుక్రవారం పట్టణ సమీపంలోని హౌసింగ్ కార్యాలయానికి చేరుకుని హౌసింగ్ ఏఈఈ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. నాయుడుపేట పట్టణంతోపాటు రూరల్ మండలం,నియోజకవర్గంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాల వివరాలను ఏ ఇ ఇ ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలో 258, మండలంలో 1319,సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఏడు వేల మందికి పైగా ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.హౌసింగ్ శాఖ నిబంధనల మేరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసేందుకు ప్రపోజల్స్ పంపినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా మాజీ కార్యదర్శి బొల్లకాయల విజయభాస్కర్, జిల్లా మాజీ కార్యదర్శి ఆశా చెంచు కృష్ణయ్య, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పోలు సుబ్రమణ్యం, బిజెపి నాయకులు సర్వారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోట్లపూడి శ్రీనివాసులు, నాయుడుపేట మండలం బిజెపి అధ్యక్షులు పి.రవి,తదితరులు పాల్గొన్నారు.