*సీఎం పాలనా దక్షతకు బడ్జెట్ అద్దం పడుతోంది.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్మిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై ప్రశంసలు గుప్పించిన కోవూరు ఎమ్మెల్యే శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.*
– రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం కృషి చేస్తున్నారు
– మహిళా సంక్షేమానికి బడ్జెట్ లో పెద్దపీట వేశారు
– 2025-26 ఆర్థిక బడ్జెట్ లో నెల్లూరు జిల్లాకు భారీ కేటాయింపులు
– ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో నిత్యం ప్రజా సేవలో ఉంటాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్మిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై ప్రశంసలు గుప్పించిన కోవూరు ఎమ్మెల్యే శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు గారి పాలనా దక్షతను కొనియాడారు. ఈ మేరకు సోమవారం బడ్జెట్‌పై సమావేశం సందర్భంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు.
2025-26 బడ్జెప్ పై సభలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవనీయులు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పాలనా దక్షతకు బడ్జెట్ అద్దం పడుతోందని, పేదలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారన్నారు. చంద్రబాబు గారు రూపకల్పన చేసిన స్వర్ణాంధ్ర – విజన్ 2047ను సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు.
గత ప్రభుత్వ అసమర్థ పాలన, నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు సభా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, జల వనరులు, రహదారుల అభివృద్ధి, పింఛన్లు, ఐటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను నిరూపించారన్నారు.
బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, మహిళా శిశు సంక్షేమానికి రూ.4332 కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తూనే, తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించారన్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు మేలు చేసేలా అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025-26 బడ్జెట్ లో 60 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అంగన్వాడీల నిర్వహణకు రూ.878 కోట్లు కేటాయించ ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారని కొనియాడారు.
ఇక నెల్లూరు జిల్లాకు 2025-26 ఆర్థిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసిన కారణంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ కు బడ్జెట్ లో రూ.345 కోట్లు, సోమశిల జలాశయానికి రూ.266 కోట్లు కేటాయించి అభివృద్దికి బాటలు వేశారని ప్రశంసించారు. జిల్లాకు తలమానికమైన విక్రమ సింహపురి యూనివర్సిటీకి రూ.20.53 కోట్లు కేటాయించడం కొత్త పరిశోధనలకు తోడ్పాడు అందనుండటం సంతోషం కలిగించే అంశం.
అలాగే రామాయపట్నం పోర్ట్ కు రూ.100 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు రూ.247 కోట్లు పంపిణీ కాబోతున్నాయని, జిల్లాలో 12 వేల మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేద భృతి అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కొవడలూరు మండలంలో ఉన్న కిసాన్ సెజ్ కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని, ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో తాను నిత్యం ప్రజా సేవలో ఉంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.