*సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం*

– బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా..
– టిడిపి కార్యకర్తల త్యాగాలను విస్మరించను.
– పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం.
– కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం.
– పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కష్టాన్ని విస్మరించను.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే.. తెలుగు ప్రజల ప్రతిభకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డి పాళెం చెన్నూరు రోడ్డులోని మర్రి చెట్ల సెంటర్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన టిడిపి 43 వ ఆవిర్భావ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో 43 ఏళ్లుగా పార్టీ జెండా మోసి టిడిపి కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన సుబ్బారెడ్డి, బషీర్ గార్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోనికి రావడం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్ళలో అమలు చేస్తూ తెలుగునాట సామాజిక విప్లవానికి తెలుగుదేశం పార్టీ నాంది పలికిందన్నారు.
ఒకప్పుడు ఓటర్లుగా మాత్రమే వున్న బడుగు, బలహీన వర్గాలను లీడర్లగా మార్చిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిదేనన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తిలో హక్కు, పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్ళు లాంటి ఎన్నో జనహిత కార్యక్రమాలతో దేశంలోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ ఏదైనా వుందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని చెప్పడానికి గర్వంగా వుందన్నారు.

1995 లో పార్టీ పగ్గాలు చేపట్టిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిగా నేటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా తెలుగు వారి ప్రతిభను ప్రపంచ నలు మూలలకు విస్తరింపచేశారని కొనియాడారు. పార్టీ కష్ట కాలంలో వున్నప్పుడు యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి తండ్రికి తగ్గ తనయుడు నిరూపించుకున్నారని లోకేష్ బాబు గారిని ప్రశంసించారు. ఇటు పార్టీలోనూ అటు పాలనా పరంగాను విప్లవాత్మక మార్పులు తెస్తున్న మంత్రి లోకేష్ గారిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రశంసించారు. ఒక్క కోవూరు నియోజకవర్గానికే దాదాపు 2 కోట్ల వరకు ముఖమంత్రి సహాయ నిధి అందచేసి కార్యకర్తల ఆరోగ్య రక్షణకై పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె కృతజ్ఞతలు తెలియ చేశారు. కార్యకర్తలకు ఈ ఆపద వచ్చినా ఆదుకుంటానని హామీ యిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ ఏ కార్యకర్తకు అన్యాయం జరగదని ఆమె హామీ యిచ్చారు. గత ఎన్నికల సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు టిడిపి కార్యకర్తలు చప్పించినా ప్రేమాభిమానాలు తనకు గుర్తున్నాయన్నారు. విలువలతో కూడిన రాజకీయం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని పార్టీ విజయం కోసం జెండా మోసిన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి రూరల్ మరియు అర్బన్ అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, టిడిపి సీనియర్ నాయకులు వింజం రామానాయుడు, ఏటూరి శివరామ కృష్ణారెడ్డి, టంగుటూరు మల్లారెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి గార్లతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed