*సర్వేపల్లిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు*
*వైసీపీని వీడి టీడీపీలో చేరిన తోటపల్లి గూడూరు మండలం పేడూరు ఉప సర్పంచ్ సంగారు సుజన, శివయ్య, దినేష్, రాజేశ్వరమ్మ, తదితర 70 కుటుంబాలు*
*సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గూడూరు నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*గత సార్వత్రిక ఎన్నికల్లో సోమిరెడ్డికి 450 ఓట్ల మెజార్టీ ఇచ్చిన పేడూరు పంచాయతీలో టీడీపీ మరింత బలోపేతం*
*సోమిరెడ్డి కామెంట్స్*
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం
నిన్న చెముడుగుంట సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు కీలక నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ రోజు పేడూరు ఉప సర్పంచ్ తో కలిసి 70 కుటుంబాలు చేరి వైసీపీని ఖాళీ చేశాయి
నాకు సొంతూరుతో సమానమైన పేడూరు అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీది ప్రత్యేక ముద్ర. గతంలోనే పేడూరు – చింతోపుల మధ్య తారు రోడ్డు నిర్మించాం
ఈ రోడ్డుతో రైతుల రాకపోకలకు మార్గం సుగమం కావడంతో పాటు భూముల విలువ భారీగా పెరిగింది
కృష్ణారెడ్డిపాళెం నుంచి మాచర్లవారిపాళేనికి గతంలోనే రోడ్డు మంజూరు చేయగా వైసీపీ ప్రభుత్వంలో పక్కన పెట్టేశారు. ఆ రోడ్డు పనులను కూడా చేపడతాం
పేడూరు పంచాయతీ పరిధిలో రూ. 35 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి పథకాల పనులు చేస్తున్నాం
వరిపొలాల్లో చేపట్టిన బీపీసీఎల్ పైపులైను పనులతో పంట ధ్వంసం అవుతుండటంపై అభ్యంతరం తెలిపి పేడూరు రైతులకు అండగా నిలిచాం
ప్రస్తుతం పైపులైను పనులను ఆపడంతో పాటు బాధిత రైతులకు తమిళనాడులో పరిహారం ఇచ్చిన తరహాలోనే ఇక్కడ కూడా ఇవ్వాలని కోరాం