*సండే మార్కెట్ వద్ద జరుగుతున్న ట్రైన్లు కాలువల నిర్మాణ పనులను మరియు ఆక్రమణల తొలగింపు పనులను పర్యవేక్షించిన కమిషనర్*

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ఆక్రమణల తొలగింపు, డ్రైను కాలువల నిర్మాణం పనులను మంగళవారం పర్యవేక్షించారు.

పట్టణ ప్రణాళిక విభాగం వారు నిర్దేశించిన మార్కింగ్ పరిధి దాటి దుకాణాలను ఏర్పాటు చేయరాదని స్థానిక దుకాణాల నిర్వాహకులను కమిషనర్ హెచ్చరించారు.

డ్రైను కాలువ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, కాలువలపై ఏర్పాటు చేసిన నిర్మాణాలను పూర్తిస్థాయిలో తొలగించి వేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *