*శ్మశానాలనూ వదలని కాకాణి బ్యాచ్ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఇరిగేషన్ పనుల్లో జరిగిన రూ.150 కోట్ల కుంభకోణంతో రైతులకు తీరని నష్టం*
*సోమశిల దక్షిణ కాలువ కింద మొదటి పంటను కోల్పోయిన రైతులు*
*ప్రజల ఆశీస్సులతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే కాకాణి అండ్ బ్యాచ్ అక్రమాలపై సమగ్ర విచారణ, దోపిడీ సొత్తు రికవరీ*
*కబ్జాకు గురైన భూములను తిరిగి పేదలకు అప్పగిస్తా*
*పొదలకూరు మండలం నావూరు, నావూరుపల్లి, భోగసముద్రం, సూరాయపాళెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలు*
*సోమిరెడ్డి కామెంట్స్*
సోమశిల జలాశయంలో 33 టీఎంసీలు నీళ్లున్నా దక్షిణ కాలువ కింద నావూరు, నావూరుపల్లి, భోగసముద్రం రైతులకు మొదటి పంటకు నీళ్లు ఇవ్వలేదు
గత ఏడాది 30 టీఎంసీలు నీటిని వృథా చేసిన ఫలితంగా రైతులు మొదటి పంట వేసుకోలేని పరిస్థితి తెచ్చారు
ఇరిగేషన్ పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపి క్యాష్ చేసుకున్న కాకాణి అండ్ బ్యాచ్ నీళ్లన్నీ బురదపాల్జేసి రైతులకు కష్టాలు తెచ్చింది
మొదటి పంట వేసుకోలేకపోతే రైతులు ఎంత బాధపడుతారో నాకు తెలుసు
ఐదేళ్లలో కాకాణి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది.
సూరాయపాళెంలో 36 ఎకరాల మేత పొరంబోకు భూమిని కబ్జా చేసేశారు
గిరిజన కాలనీకి చెందిన 70 సెంట్లు శ్మశాన స్థలాన్ని ఆక్రమించేశారంట
వైసీపీకి ఓట్లు వేసి గెలిపించినందుకు పేదల నుంచి పెద్దోళ్ల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా దోచుకుంటారా
కొండల, తిప్పలు, గనులు దోచుకున్నది చాలడం లేదా..చివరకు శ్మశానాలను కూడా వదిలిపెట్టడం లేదు
ప్రతి సెంటు భూమిని వైసీపీ నేతల ఆక్రమణ చెర నుంచి విడిపించి తిరిగి పేదలకు అప్పగిస్తాం.
గిరిజనుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. మేకల పొట్ట రాసుకున్నా గోడలు కూలిపోతున్నాయి
నాకు, కాకాణికి తేడాను ప్రజలు బాగా గమనించారు. చంద్రబాబు నాయుడు పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలన మధ్య తేడా చూశారు
సర్వేపల్లి ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు
జూన్ 4న ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల భూములను కాకాణి అండ్ బ్యాచ్ ఆక్రమణ చెర నుంచి విడిపిస్తా
ఇళ్ల నిర్మాణం పేరుతో సిమెంట్ అమ్మేసుకోవడం, బిల్లులు డ్రా చేసేసుకుని గిరిజనులకు తీరని అన్యాయం చేశారు. విచారణ జరిపించి ప్రతి రూపాయి కక్కిస్తాం
పేదలతో పాటు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా ముందుక సాగుతా
ఇరిగేషన్ పనుల చేయకుండానే చేసినట్లు చూపి రూ.150 కోట్లు దోచేసిన వైనంపైనా విచారణ తప్పదు. ఈ దోపిడీ కారణంగా రైతులకు జరిగిన నష్టం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది.
గనులను దోచేసిన మైనింగ్ మాఫియా బ్యాచ్ ను వదిలే ప్రసక్తే లేదు. ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి దోపిడీ చేసిన సొత్తును రికవరీ చేస్తాం
ఓ వైపు దళితులు, గిరిజనులు పేదరికంతో అల్లాడుతుంటే వీళ్లు మాత్రం వందల కోట్లు, వేల కోట్లు దోచుకుంటున్నారు
రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి హోల్ సేల్ గా దోచుకుంటుంటే. సర్వేపల్లిని కాకాణి రిటైల్ గా దోచేసుకుంటున్నాడు