*వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్న నగర కమిషనర్ వై ఓ నందన్*

“స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమం నిర్వహణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ల నేతృత్వంలో శనివారం స్థానిక 19వ డివిజన్ రామలింగాపురం పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా కమిషనర్ పార్కును సందర్శించిన స్థానిక ప్రజలు, విద్యార్థులతో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా చేపట్టాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ కనకాద్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు, అడిషనల్ డైరెక్టర్ ఆర్టికల్చర్ నరసింహారావు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *