*వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు*.

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

స్థానిక మూలపేట, క్రాంతి నగర్, రాజీవ్ గృహకల్ప, మనుమ సిద్ది నగర్ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 12 వీధి శునకాలను పట్టుకుని స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎబిసి సెంటర్ కు తరలించారు.

ఈ సందర్భంగా వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ మాట్లాడుతూ రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, వాటి యజమానులు సంరక్షించుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ అంతరాయాలకు కారణం అవుతున్న రోడ్లపై తిరిగే పశువులను తప్పనిసరిగా గోశాలలకు తరలిస్తామని డాక్టర్ హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed