
*విపిఆర్ నేత్ర ప్రారంభోత్సవం రోజునే 64 మందికి కంటి పరీక్షలు*
– విపిఆర్ నేత్రకు తరలుతున్న ప్రజలు
– 64 మందిలో 50 మందికి అద్దాల అందజేత
– రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రామాపురం ప్రజలకు పరీక్షలు చేయనున్న సిబ్బంది
– ప్రతి పంచాయతీకి షెడ్యూల్ వారీగా రానున్న విపిఆర్ నేత్ర బస్సు
ఎంతో ఉన్నత ఆశయంలో, గొప్ప సంకల్పంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విపిఆర్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గార్లు ప్రారంభించిన విపిఆర్ నేత్ర కు తొలిరోజు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రారంభోత్సవం సందర్భంగా తొలిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 64 మందికి విపిఆర్ నేత్ర బస్సులో కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 50 మందికి కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. వారికి తగిన సూచనలు చేశారు.
విపిఆర్ నేత్ర బస్సును రేపటి నుంచి రామాపురం గ్రామంలోని సచివాలయం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామాపురం పంచాయతీ పరిధిలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రేపు రామాపురం పంచాయతీ అనంతరం వరికుంటపాడు మండలంలోని మరో పంచాయతీలో బస్సును ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి రామాపురం పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.