*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మరియు సాహిత్య అకాడమీ (న్యూ ఢిల్లీ) సంయుక్తంగా నిర్వహించిన “లిటరరీ ఫోరం”*
………………
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరియు సాహిత్య అకాడమీ న్యూ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన ” లిటరరీ ఫోరం” కార్యక్రమం ఈ రోజు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్‌చార్జ్ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో వ్యవసాయ సంబంధమైన అంశాలను ప్రస్తావిస్తూ తటాకాల నిర్మాణం, భూమి ప్రాశస్త్యం, రైతు జీవితం విశిష్టత, వ్యవసాయ రాగానికి సంబంధించిన మూలాలు ప్రాచీన సాహిత్యంలోనే కనిపిస్తాయని అన్నారు. పోతన, శ్రీనాథుల వంటి మహా కవుల రచనలు ఇందులో ఉదాహరణగా పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారి ప్రసంగిస్తూ “సాహిత్యం సామాజిక విలువలకు దర్పణం అంటూ ఆయా కాలాల సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేది కూడా చక్కటి సాహిత్యమే అని తెలిపారు. రైతు జీవితం గురించి తెలిపే సాహిత్యం నిజంగా ఎంతో విలువైనది. ముందు తరాల వారికి ఆదర్శనీయం అన్నారు. తెలుగు శాఖ సాహితి సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు.
వక్త గా విచ్చేసిన మాడభూషి సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి “నాగేటి గోడు”, చింత అప్పలనాయుడు గారి “అరచేతిలో బువ్వ పువ్వు” వంటి కవిత్వాలు రైతు జీవితాన్ని ప్రతిబింబించేందుకు గొప్ప ఉదాహరణలని పేర్కొన్నారు. రైతు భూమితో, పశువులతో ఉన్న అనుబంధం, రైతు పడే కష్టాలు, వాటిని అధిగమించేందుకు వ్యవసాయంపై సమాజం చూపే సహకారం ఎంతో కీలకమని వివరించారు.
అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ గారు మాట్లాడుతూ దువ్వూరి రామిరెడ్డి గారి “కృషీవలుడు” రచనలతో పాటు గంగుల సాయి రెడ్డి గారి కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ, రైతు జీవితంలోని కష్టాలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపించాలని, రైతు రాజుగా రైతుల గౌరవం పెంచేలా మార్పులు రావాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్.విజయ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అనురాధ రామకృష్ట రచించిన”రక్త ఘొష” పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు ఆవిష్కరించారు. మొదటి ప్రతిని డాక్టర్ గుండాల నరేంద్ర బాబు అందుకున్నారు. ఇంక ఈ కార్యక్రమంలోడాక్టర్ సుజా ఎస్ నాయర్ గారు, కో- కన్వీనర్ డాక్టర్ సి. రాజారామ్ గారు, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ టి. విమల, డాక్టర్ కె లక్ష్మి నారాయణ రెడ్డి, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed