*విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా ఉపాధ్యాయ విద్య పై నేషనల్ ఎడ్యుకేషన్ దృక్కోణాలు ‘ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్’ కార్యక్రమం ప్రారంభం…*

నెల్లూరు: 20.12.2025 విక్రమ సింహపురి యూనివర్సిటీలోని సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఉపాధ్యాయ విద్య పై నేషనల్ ఎడ్యుకేషన్ దృక్కోణాలు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
*NEP-2020తో విద్యావ్యవస్థలో సమూల మార్పులు: విసి*
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం–2020 (NEP-2020) భారత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
పరిశోధనలే కీలకం: ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం కాకుండా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు మరియు నైతిక విలువల పెంపొందింపుపై దృష్టి సారించాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధి: మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను నవీకరించుకోవడానికి ఇటువంటి ఎఫ్‌డిపిలు ఎంతో దోహదపడతాయని అనుభవ పూర్వక విద్యను అందించాలని ఆయన పేర్కొన్నారు.

*అతిథుల ప్రసంగాలు*
కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఎస్పీఎంవీవీవీ (తిరుపతి) బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ ఆచార్య టి.జి. అమృతవల్లి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణలో అనుభవాధారిత బోధన, సాంకేతికత వినియోగం అత్యంత కీలకమని తెలిపారు.
NCERT రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓఎస్‌డీ ఆచార్య బి. రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు సృజనాత్మక మరియు టెక్నాలజీ ఆధారిత పద్ధతులను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్ ఆచార్య జి. విశ్వనాథప్ప మాట్లాడుతూ, జాతీయ పాఠ్యచట్రం (National Curriculum Framework – NCF) గురించి విశదంగా వివరించారు. NEP–2020లో భాగంగా రూపొందించిన జాతీయ పాఠ్యచట్రం ఉపాధ్యాయ విద్య, విద్యార్థి కేంద్రిత అభ్యాసం, నైపుణ్యాధారిత బోధనకు దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. పాఠ్యప్రణాళికల రూపకల్పనలో సౌలభ్యం, సమగ్రత, మరియు సాంకేతికత వినియోగం కీలకమని ఆయన పేర్కొన్నారు. సమన్వయం – నిర్వహణ
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.హెచ్. విజయ అధ్యక్షత వహించగా, డాక్టర్ ఆర్. మధుమతి కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.అధ్యాపకులు ఆచార్య సుజా ఎస్ నాయర్, డాక్టర్ పి చెంచురెడ్డి,డాక్టర్ బి వి సుబ్బారెడ్డి, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల అధ్యాపకులు మరియు పరిశోధన విద్యార్ధులు,విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed