
*విక్రమ సింహపురి వర్సిటీలో ‘డ్రోన్ టెక్నాలజీ’ జాతీయ వర్క్‌షాప్ ముగింపు…..*
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న “నేషనల్ వర్క్‌షాప్ ఆన్ డ్రోన్ టెక్నాలజీ” శుక్రవారం ఘనంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం పీఎం ఉష (PM-USHA) ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన సాంకేతికతపై పట్టు సాధించాలి: వీసీ అల్లం శ్రీనివాసరావు
ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. పరిశోధనలు, వ్యవసాయం, రక్షణ రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, ఇలాంటి వర్క్‌షాప్‌లు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్య అతిథులు మరియు వక్తలు
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య G. రాజారామిరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, మరో అతిథిగా Associate Professor Dr. M. నరేష్ బాబు, Department of CS&E, IIITDM Kurnool పాల్గొని ప్రసంగించారు. డ్రోన్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులను వారు వివరించారు.
కార్యక్రమ విశేషాలు:
నిర్వహణ: కంప్యూటర్ సైన్స్ విభాగం, విక్రమ సింహపురి వర్సిటీ.
సహకారం: ప్రధాన్ మంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్ (PM USHA).
ముఖ్య ఉద్దేశ్యం: విద్యార్థులకు డ్రోన్ తయారీ, ఆపరేటింగ్ మరియు అప్లికేషన్లపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడం.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కే సునీత కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఆచార్య అందే ప్రసాద్ కోకో ఆర్డినేటర్ గా డాక్టర్ M.Ussenaiah, డాక్టర్ G Vijaya Lakshmi, డాక్టర్ యన్ ఓ.గోపాల్, డాక్టర్ A. Siva Sankar Reddy మరియు విద్యార్థిని విద్యార్థులు పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు