
*విక్రమ సింహపురి వర్సిటీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం: పౌరుల నైతిక విలువల వల్లే అవినీతి నివారణ సాధ్యం.*
………
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు మై భారత్ (నెల్లూరు) సంయుక్త ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం విశ్వవిద్యాలయం కళాశాల పరిధిలో నిర్వహించారు. “విజిలెన్స్: మన ఉమ్మడి బాధ్యత” అనే తాత్విక అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా యువక శాఖ అధికారి ఏ. మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, అవినీతి నివారణకు సరిపడిన నిబంధనలు మాత్రమే కాదు, పౌరుల నైతిక విలువలు కూడా అవసరమన్నారు. యువతలో నిజాయితీ – బాధ్యత – పౌర చైతన్యం పెంపొందితేనే మంచి పాలన, పారదర్శక వ్యవస్థలు బలపడతాయని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా. ఉదయ శంకర్ అల్లం మాట్లాడుతూ, సమాజంలో నైతికతకు మనమే మూలాధారమని, ప్రతి విద్యార్థి తన వ్యక్తిగత జీవితంలో అప్రమత్తతను అలవర్చుకుంటే అవినీతి లేని భారత నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అవగాహనతో కూడిన పౌరుడే నిజమైన బాధ్యత గల పౌరుడని అన్నారు.
అనంతరం విద్యార్థులు అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సిబ్బంది, మరియు హాస్టల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.