
*విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ర్యాలీలో ముఖ్యఅతిథిగా అతిథిగా పాల్గొన్న నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక వి.ఆర్ కళాశాల మైదానంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ర్యాలీని శుక్రవారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ @ 150 కార్యక్రమంలో భాగంగా “వాక్ ఫర్ యూనిటీ & వాక్ ఫర్ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో వల్లభాయ్ పటేల్ ఆదర్శాన్ని పౌరులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ అభిప్రాయపడ్డారు.