*వి.ఎస్.యూ విద్యార్థిని యన్. బేబీకి డాక్టరేట్*

నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని యన్. బేబీకి డాక్టరేట్ లభించింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ ఆచార్య సుజా ఎస్. నాయర్ పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.

యన్. బేబీ “A STUDY ON INDIVIDUAL CHARACTERISTICS ON INTENTIONS TO PURSUE SOCIAL ENTREPRENEURSHIP BY MBA STUDENTS IN ANDHRA PRADESH” అనే అంశంపై తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, యన్. బేబీ చేసిన పరిశోధన మేనేజ్‌మెంట్ రంగంలో సమాజానికి ఎంతో ఉపయోగకరమైనదని ప్రశంసించారు. సామాజిక వ్యాపారం వైపు యువతను ప్రోత్సహించే విధంగా ఆమె పరిశోధనలో విలువైన ప్రతిపాదనలు ఉన్నాయని కొనియాడారు. విశ్వవిద్యాలయానికి గౌరవం తీసుకువచ్చిన యన్. బేబీకి మరియు మార్గదర్శకురాలు ఆచార్య సుజా ఎస్. నాయర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టరేట్ పొందిన యన్. బేబీని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ జి సుజయ్ కుమార్, పరీక్షల నియంత్రకుడు డాక్టర్ ఆర్ మధుమతి, బిజినెస్ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి డా. జి శ్రవంతి, డాక్టర్ పి చెంచురెడ్డి, డాక్టర్ జె. విజేత, ఇతర బోధన సిబ్బంది మరియు పరిశోధన విద్యార్థులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed