*వి.ఎస్.యూ లో సేంద్రీయ బిందు సేద్యం ద్వారా కూరగాయల సాగు ప్రారంభం – వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు…*

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యు) లో సేంద్రీయ బిందు సేద్యం ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించే బృహత్తర కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. వి.ఎస్.యు ఎన్‌ఎస్‌ఎస్ సెల్ మరియు సెంటర్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని కూరగాయ మొక్కలు నాటారు.

సేంద్రీయ వ్యవసాయం భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి మేలుచేసే మార్గం. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల భూమి నాణ్యత తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, విద్యార్థులు మరియు రైతులకు సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కల్పించడం అత్యంత అవసరం. వి.ఎస్.యు ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉంది. విద్యార్థులు శాస్త్రీయంగా పరిశోధనలు చేయడానికి వీలుగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా విశ్వవిద్యాలయంలో ప్రయోగాలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మేము సంకల్పించాము.

పండ్ల తోటలో అంతర పంటగా కూరగాయల సాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని వైస్ ఛాన్సలర్ గారు అన్నారు.

ఈ కార్యక్రమం విద్యార్థులకు మరియు రైతులకు ఆచరణాత్మక అభ్యాస వేదికగా మారుతుంది. భూమికి, భవిష్యత్తు తరాలకు మేలు చేసే ఈ ఉద్యమాన్ని అందరూ ప్రోత్సహించాలి! అని వైస్ ఛాన్సలర్ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత, ప్రొఫెసర్ సుజా ఎస్. నాయర్, డా. ఉదయ శంకర్ అల్లం (ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు కోఆర్డినేటర్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్), డా. బి.వి. సుబ్బా రెడ్డి (ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్), డా. సీహెచ్. సాయిప్రసాద్ రెడ్డి, డా. జి. సుజయ్, డా. కోట నీల మణికంఠ
ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని టమోటా మొక్కలు 600 వంకాయ 600 పచ్చిమిర్చి 400 క్యాబేజీ 100 మొక్కలు మరియు బోర్డర్ చుట్టూ, బంతి (మారిగోల్డ్) మొక్కలు నిర్జీవ పురుగులను నియంత్రించడానికి ట్రాప్ క్రాప్‌గా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed