*” వి ఎస్ యూ లో BLUE REVOLUTION: INNOVATIONS IN MARINE SYSTEMS (BRIMS-2025)” విజయవంతంగా ముగింపు….*
………
కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు “BLUE REVOLUTION: INNOVATIONS IN MARINE SYSTEMS (BRIMS-2025)” విజయవంతంగా ముగిసింది.
సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై, విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సముద్ర పరిశోధన, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, బ్లూ ఎకానమీ విభాగాల్లో ఇలాంటి సదస్సుల ప్రాముఖ్యత గురించి వివరించారు. సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు పరిశోధనలు, సాంకేతికత, పారిశ్రామిక భాగస్వామ్యాలు కీలకమైనవి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసులు మాట్లాడుతూ, BRIMS-2025 ద్వారా సముద్ర వ్యవస్థాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పరిశోధనలకు దారితీయడం, విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమల మధ్య అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా వి.ఎస్.యు మాజీ రిజిస్ట్రార్, ఆచార్య పి .రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సముద్ర ఆవిష్కరణలపై పరిశోధనలు పెరగడం వలన భవిష్యత్ తరాలకు మునుపటి కంటే మెరుగైన వనరులు అందుబాటులోకి రావచ్చు అని తెలిపారు. సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ ఆవిష్కరణలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు సముద్ర పారిశ్రామిక రంగంలో అవకాశాలను గమనించి, కొత్త ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని సముద్ర జీవవైవిధ్యం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, బలమైన బ్లూ ఎకానమీ కోసం ఆధునిక సాంకేతికతలు వంటి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఇన్చార్జ్ డాక్టర్ కె. సునీత, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సు సమన్వయకర్తలుగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డాక్టర్ సిహెచ్. వెంకట్రాయులు, డాక్టర్ ఎం. హనుమ రెడ్డి వ్యవహరించారు.
