
*SPS నెల్లూరు జిల్లా*
*వార్షిక తనిఖీలో భాగంగా చిన్న బజార్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచుతూ పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు.
పోలీస్ స్టేషన్ పరిధులు, క్రైం చార్ట్‌లను పరిశీలించి, వాటిని నిరంతరం అప్డేట్ చేయాలని, స్టేషన్ పరిధిలోని నేరాలు, శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీసారు.
గత మూడు సంవత్సరాల కాలంలో నమోదైన నేరాల CD ఫైల్స్ పరిశీలించి, తగిన దిశానిర్దేశాలు జారీ చేశారు.
గ్రేవ్ కేసుల దర్యాప్తును నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని, లాంగ్ పెండెన్సీ తగ్గించాలని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులను పర్యవేక్షించి కన్విక్షన్ రేటు పెంచాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు తగిన ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడి.
వాణిజ్య పరమైన అన్నీ షాపులు, ప్రాంతాలలో CCTV కెమెరాలు అమర్చుకునేలా ప్రాముఖ్యత వివరించి, అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడి.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు. సైబర్ కేసులు చేధించుటకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.
మహిళా సంబంధిత కుటుంబ తగాదాలు, మిస్సింగ్ కేసులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్టులు, పాత నేరస్తులపై నిఘా పెంచి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి అధికప్రధాన్యత. వారి యొక్క శారీరక దృడత్వంతో పాటు ఆరోగ్యం, మానసిక స్థితికి అనుగుణంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.30.12.2025.