*వర్షాకాల నేపథ్యంలో ఇంకా డీసిల్టేషన్ పూర్తిగాని మేజర్ కాలువలలో సిల్ట్ తొలగించాలని, వర్షపు నీరు పారుదలకు ఉన్న అడ్డంకులు గుర్తించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన : నగర కమిషనర్ వై ఓ నందన్* 

నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగంతో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా ప్రతి సచివాలయ అమెనిటీస్ కార్యదర్శి వారి సచివాలయ పరిధిలో ప్రతిరోజు నీటి నాణ్యత గమనించాలని, అదేవిధంగా కొళాయిలకు సంబంధించి లీకేజెస్ గుర్తించి వాటిని నిరోధించాలని ఆదేశించారు.

వర్షాకాల నేపథ్యంలో ఇంకా డీసిల్టేషన్ పూర్తిగాని మేజర్ కాలువలలో సిల్ట్ తొలగించాలని, వర్షపు నీరు పారుదలకు ఉన్న అడ్డంకులు గుర్తించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

సచివాలయాల పరిధిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించి తాగునీటి కుళాయిలను గుర్తించాలని, అనధికార తాగునీటి కుళాయిలను క్రమబద్ధీకరించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి కార్యదర్శి నిర్దేశించిన రోజు వారి లక్ష్యాలను కచ్చితంగా అందుకోవాలని, అలా అందుకోని సిబ్బంది పై చర్యలు తీసుకొనుటకు వెనుకాడమని స్పష్టం చేశారు.

అన్ని సమయాలలో సమస్యలపై స్పందించే విధంగా అధికారులు సిబ్బంది 24 * 7 ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు, ఫిట్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed