*”ర్యాలీలు విజయవంతం చేయండి”- కాకాణి*

– *కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించిన 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి, వైద్య విద్యను దూరం చేయడంతో పాటు, పేదలకు వైద్యం కూడా దూరం చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే!*

– *కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా, మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది.*

– *ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు, కందుకూరు నియోజకవర్గంతో సహా అన్ని నియోజకవర్గాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన రావడం, పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, మద్దతు ఇస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.*

– *రౌండ్ టేబుల్ సమావేశాలలో రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందించి, ప్రజలకు అవగాహన కల్పించి, ప్రైవేటీకరణపై ఉద్యమ పోరు ఉవ్వెత్తున ఎగిసేలా సహకరించిన సమాజ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.*

– *కూటమి ప్రభుత్వపు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉద్యమ పోరు మరింత ఉధృతం చేసేందుకు, రేపటి రోజు అనగా నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాలల్లో చేపట్టనున్న “వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం” ర్యాలీలలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, పౌరహక్కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, పాల్గొని, జయప్రదం చేసి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అందరి సహాయ సహకారాలు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నా.*

– *”వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం” ర్యాలీలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వేడుకుంటూ..*

*- డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి*
*అధ్యక్షులు,*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ*
*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed