రైతు సేవ కేంద్రాలు తెరిచారు
*మాయిచ్చర్ మిషన్లు మరిచారు*
*రైతులు దగా పడుతున్నారు*.
వాస్తవ పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం
దృష్టికి తీసుకువెళ్లాలని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్
వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారులకు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆర్ఎస్కే లను ప్రారంభించి వెళ్లారు .
ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెంటనే ప్రతి ధాన్యం రైతు నష్టపోకుండా చూసే బాధ్యత సివిల్ సప్లై అధికారుల దని చెప్పి వెళ్లారు.
పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరూస్తూ ఉన్న ధాన్యం తేమ శాతాన్ని నిర్ధారించే పరికరాలను మాత్రం ఆర్ఎస్ కే లలో అందుబాటులో ఉంచలేదు..
వ్యవసాయ శాఖ అధికారులు కు సంబంధం లేకపోయినా చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు .
ధాన్యం విక్రయాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు చర్యలు మిల్లర్లు లాభపడేలా ఉన్నాయి.
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఆర్ఎస్కేలను సంపూర్ణంగా ప్రారంభించి రైతులను ఆదుకోవాలని రమేష్ విజ్ఞప్తి చేశారు
వ్యవసాయ శాఖ కార్యాలయంలో రమేష్ తో పాటు బిజెపి నేతలు నరాల సుబ్బారెడ్డి. కంచర్ల నారాయణ యాదవ్.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు