*రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం – మోదీ కులం 1999లోనే ఓబీసీగా గుర్తింపు : బిజెపి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్*
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యాకే తన కులాన్ని ఓబీసీగా ప్రకటించుకున్నారు” అనే వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని బిజెపి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ అన్నారు.
నిజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులం 1999 అక్టోబర్ 27న ఓబీసీ జాబితాలో చేర్చబడింది. ఇది ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రెండేళ్ల ముందు. ఈ వాస్తవాలను విస్మరిస్తూ, నిరాధార ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారానికి, దుష్ప్రచార రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు.
“మీ రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇంత అబద్ధాలు, అబూతు కల్పనలు చెప్పడం తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అవసరమా?” అని ప్రశ్నించారు.