
*రెవెన్యూ మొండి బకాయిల వసూళ్లకై నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్, బృందావనం తదితర ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ : నెల్లూరు నగరపాలక సంస్థసంస్ద అదనపు కమిషనర్ వాసు బాబు*
నెల్లూరు నగరపాలక సంస్థసంస్ద అదనపు కమిషనర్ వాసు బాబు రెవెన్యూ మొండి బకాయిల వసూళ్లకై నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్, బృందావనం తదితర ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ శుక్రవారం నిర్వహించారు.
బకాయి దారులను నేరుగా కలుసుకొని పన్నుల చెల్లింపుకై నోటీసులను జారీ చేశారు. నిర్దేశించిన సమయంలోపు బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేసుకుంటామని హెచ్చరించారు. మొండి బకాయి దారులను గుర్తించి డిసెంబర్ 13వ తేదీ జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ ద్వారా అపరాధ రుసుము వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అదనపు కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం ఇన్స్పెక్టర్ వరప్రసాద్, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు