*రెడ్ క్రాస్ కు రాజకీయాలు ఆపాదించి రెడ్ క్రాస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు ..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
*రెడ్ క్రాస్ కు రాజకీయాలు ఆపాదించి రెడ్ క్రాస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు ..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాణి *గోవర్ధన్ రెడ్డి* గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కు దేశ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సేవే పరమావధిగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గా రెడ్ క్రాస్ ను ఎంతగానో అభివృద్ధి చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.
🔹 రెడ్ క్రాస్ కు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారికి రాజకీయాలు ఆపాదించి ఆయన రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వాన్ని జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయడం విడ్డూరమన్నారు.
🔹 అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలైన నేతాజీ సుబ్బారెడ్డి గారు, దామిశెట్టి సుధీర్ నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి లకు సంబంధించిన సభ్యత్వాలను రద్దు చేశారని తెలిపారు.
🔹 జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయన్నారు.
🔹 ఇలాంటి నిర్ణయాలను ప్రజలెవరూ హర్షించరని.. భవిష్యత్తులో కలెక్టర్ గారే ఇలాంటి నిర్ణయం చేయడంపై.. పునరాలోచించుకొనే పరిస్థితి వస్తుందన్నారు.
🔹 రెడ్ క్రాస్ సభ్యత్వం రద్దు పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..*
👉 *ఎలాంటి వృత్తిలో ఉన్న , ఏ సేవా సేవా రంగంలో పనిచేస్తున్న.. కులం, మతం, వర్గ విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకునేందుకు అర్హత ఉందన్నారు.*
👉 *అలాంటిది కలెక్టర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని.. నా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు.*
👉 *అనేక రాష్ట్రాలు, జిల్లాల్లో రాజకీయ నాయకులు రెడ్ క్రాస్ లో ఉంటూ సేవలందిస్తున్నారని తెలిపారు.*
👉 *అక్కడ ఎక్కడా లేనిది నెల్లూరు జిల్లాలోనే కలెక్టర్ గారికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.*
👉 *జిల్లాలో అనేక పార్టీలకు సంబంధించిన వారు రెడ్ క్రాస్ లో ప్రాథమిక సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు.*
👉 *రెడ్ క్రాస్ కు రాజకీయాలు ఆపాదించి తాను చైర్మన్ పదవికి రాజీనామా చేసేట్లు చేశారని. అలాగే మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఉండకూడదని నిర్ణయాలు చేశారని.. వీటన్నిటికీ సర్దుకు పోయినప్పటికీ.. ఇప్పుడు రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసివేయడం పై ప్రజలంతా నివ్వెరపోతున్నారని అన్నారు.*
👉 *నిజాయితీగా నిస్వార్ధంగా సేవ చేస్తున్న నన్ను రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు.*
👉 *రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా ఇలా కక్ష సాధింపు ధోరణితో ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం చేస్తే.. రెడ్ క్రాస్ లో సేవ చేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు.*
👉 *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి ఈరోజు మా సభ్యత్వని రద్దు చేశారని .. ఇతర పార్టీలో ఉంటూ రెడ్ క్రాస్ లో ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు అని చెప్పడం దారుణమని అన్నారు .*
👉 *ఇలాంటి తారతమ్యాలు తీసుకొచ్చి.. రెడ్ క్రాస్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.*
👉 *మంత్రి నారాయణ గారు తన దగ్గర పని చేస్తున్న వాళ్ళని .. రెడ్ క్రాస్ లో ఉన్నత స్థానాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.*
👉 *రెడ్ క్రాస్ లో జరుగుతున్న పరిణామాలు కుట్రలో భాగమేనని ఆరోపించారు.*
👉 *రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనుకుంటే.. ప్రజాక్షేత్రంలో తలపడాలే తప్ప.. రెడ్ క్రాస్ లాంటి సేవా సంస్థను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం నీచ సంస్కృతి అని పేర్కొన్నారు.*
👉 *ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతమైతే.. రెడ్ క్రాస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు.*
👉 *నేను ఎక్కడున్నా రెడ్ క్రాస్ బాగుండాలని, రెడ్ క్రాస్ భివృద్ధికి తోడ్పాటున అందిస్తానని తెలిపారు.*
👉 *మేము వచ్చిన తర్వాత రెడ్ క్రాస్ ఎలా అభివృద్ధి చేశాము.. రెడ్ క్రాస్ లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేమో.. త్వరలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామని తెలిపారు.*
👉 *దీనిపై న్యాయ పోరాటం చేస్తామని.. హక్కులను కాపాడుకుంటామని తెలిపారు.*
ఈ మీడియా సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేతాజీ సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు.