*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి*
*ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి*
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సోమశిల, కండలేరు జలాశయాలు ప్రధాన సాగునీటి వనరులు.
ప్రస్తుతం సోమశిల జలాశయంలో 53.374 టీఎంసీలు, కండలేరు జలాశయంలో 48.517 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
సోమశిల జలాశయ పరిధిలో డెడ్ స్టోరేజీ 7.5 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు పోను 42.87 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయి.
కండలేరు జలాశయంలోనూ డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు పోను 38 టీఎంసీల జలాలు అందుబాటులో ఉండనున్నాయి.
డెడ్ స్టోరేజీ, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు పోను కనీసం 60 టీఎంసీలకు పైగా జలాలు అందుబాటులో ఉంటాయి.
రైతుల కోరిక మేరకు రెండో పంటకు నీటి కేటాయింపులకు సంబంధించి ఐఏబీ సమావేశాన్ని వెంటనే నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.