*రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

రామతీర్థం ఆలయాన్ని ధార్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండలం శ్రీకామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు రామతీర్థం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆమె చీర సారే సమర్పించారు. అనంతరం కన్నుల పండుగగా సాగిన శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ రామతీర్థంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సరిగ్గా ఏడాది క్రితం రామతీర్థం నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఆధ్యాత్మిక వేడుకలు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతాయన్నారు. శ్రీ కామాక్షి సమేత
శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో రామతీర్ధం ప్రాంతంతో పాటు కోవూరు నియోజకవర్గం పరిశ్రమలు, పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సురేష్ విడవలూరు మండల టిడిపి అధ్యక్షులు శ్రీహరి రెడ్డి టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి అడపాల శ్రీధర్ రెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed