రహదారి భద్రతా వారోత్సవాలు….
నెహ్రూ యువ కేంద్ర, ఎన్ ఏస్ ఏస్ , కే సి డి సి సంయుక్త ఆద్వర్యంలో మొదలైన వారోత్సవాలు
నెల్లూరు నగరం, జనవరి 17
నెల్లూరు నగరంలోని వి.ఆర్.సి సెంటర్ లో శుక్రవారం నాడు రహదారి భద్రతా వారోత్సవాలు ( ట్రాఫిక్ పై అవగాహన వాలంటరింగ్ పోలీసు) ఘనంగా మొదలైంది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సౌత్ ట్రాఫిక్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి , ఎన్ ఏస్ ఏస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్, జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి, ఎస్సై హరి కృష్ణ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఎన్ ఏస్ ఏస్ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 23 వరకు ఈ భద్రత వారోత్సవాలు జరుగుతాయి అని, యువత ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి అని, అలానే ప్రజలకు అవగాహన కల్పించాలి అని ట్రాఫిక్ సమస్యలు వల్ల అనేక ఇబ్బందులు ఎదురువుతునాయి అని వీటిని అధిగమించాలని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా వాహనాలు నడపాలి, మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లన అనేక సమస్యలు వస్తున్నాయి అని ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్దులును కోరారు..అనంతరం ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ యువత హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వల్లన ప్రమాదాలు నివారించవచ్చు అని అలానే మొబైల్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం అని వీటి అన్నిటిమీద ప్రజలకు మన ద్వారా అవగాహన కల్పించాలి అని తెలిపారు.. అనంతరం ఎన్ ఏస్ ఏస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ యువత ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలని , పెద్దవారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి, అలానే మొబైల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదకరం అని ప్రజలకు వాలంటరీగ్ ద్వారా మీరు తెలియజేయాలని.. ట్రాఫిక్ సమస్యలు ప్రజలకు వివరించాలని తెలిపారు.. అనంతరం ర్యాలీ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎన్ వై కే వాలంటీర్లు బి.సతీష్ కుమార్, కవిత, ఎన్ ఏస్ ఏస్ వాలంటీర్లు పాల్గొన్నారు….