*యువత కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట…*
*విద్యార్ధులు, నిరుద్యోగులు, తల్లితండ్రులతో కలసి చంద్రబాబు సర్కార్‌పై నిరసన గళం*
*–మార్చి 12న యువత పోరు పేరుతో జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా*
*–మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి*
*–జిల్లా పార్టీ కార్యాలయంలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు, విద్యార్థి సంఘ నేతలతో కలసి పోస్టర్ ఆవిష్కరణ*
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల్ని చెల్లించుకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్ధులను చదువులకు దూరం చేయడంతో పాటు నిరుద్యోగులను దగా చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణిగోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీనికి నిరసనగా విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం ఉద్యమబాట పట్టనున్నట్లు చెప్పారు. మార్చి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు వారి తల్లితండ్రులు, నిరుద్యోగులతో కలసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆరోజు బుధవారం ఉదయం 10గంటలకు నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను పలు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ నాయకులతో కలసి కాకాణి ఆవిష్కరించారు. ఆదివారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ చంద్రబాబు అన్ని రంగాల వారిని మోసం చేసినట్లుగానే విద్యార్ధులను, యువతను కూడా మోసం చేస్తున్నారన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు కంటతడిపెడుతున్న పరిస్థితులు ఏర్పడిందని చెప్పారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేకపోయేసరికి కళాశాల యాజమాన్యాలు ఫీజు బకాయిలున్నాయని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని దీంతో పరీక్షలను రాయనివ్వడం లేదన్నారు. పరీక్షలు రాసిన విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్ధులు ఇటు పరీక్షలు రాయలేక, అటు ఉన్నత విద్యను అభ్యసించలేక మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో తల్లితండ్రుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేయడం జరిగిందన్నరు. రెండు మూడు సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా అప్పటి పరిస్థితులు దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడంతో వాయిదా పడిందన్నారు. అయితే ఇలోపు చంద్రబాబు మనసు కరిగి విద్యార్థులు, యువతపై కనికరిస్తారేమోననుకుంటే ఆయన ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్ధులకు విద్యనభ్యసించే అవకాశం లేకుండా చేసేటటువంటి దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబుది అని చెప్పారు. విద్యార్ధులు తమ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో వారికి విద్యనభ్యసించడంలే ఇబ్బందులు ఉండకూడదని దివంత నేత డాక్టర్ వైఎస్సార్ ఫీజు రియింబర్స్‌మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆతరువాత ఈఫథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనసాగించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా కొనసాగుతుందని తలచి అనేక మంది విద్యార్థులు స్కూల్స్‌లో చేరడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున తల్లికి వందనం కింద నగదు జమ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రిక్తహస్తం చూపించారన్నారు. నాడు–నేడు కార్యక్రమాన్ని నీరు గార్చారని, అలాగే ఫీజురియింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రూ.8వేలకోట్లు ఖర్చుతో ఆంధ్రరాష్ట్రంలో 18మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేయడం, కొన్ని దగ్గర్ల మాకు సీట్లు అవసరం లేదని ఎంసీఐకి రాయడం వంటి దుస్సాహసం ఏ ముఖ్యమంత్రికానీ ఏప్రభుత్వం కానీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని లేని వారికి నిరుద్యోగ భృతి ద్వారా నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తానని చెప్పి మొండి చెయ్యిచూపించారన్నారు. విద్యార్ధులు, యువకుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడే విధంగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపరిపాలన కొనసాగుతుందని దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు, యువకులు, నిరుద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైందన్నారు. వారందరికి అండగా ఉండి టీడీపీ కూటమి ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు ద్వారా నిధులు విడుదల చేయించి వారందరికి విద్య సజావుగా సాఫీగా కొనసాగించేవిధంగా అలాగే యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా ప్రయతించడం లేని పక్షంలో పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైన మరింత ఉధృతం చేస్తామని ఇకనైనా చంద్రబాబు తనతపులు తెలుసుకుని విద్యార్థులు, యువకులతో చెలగాటం ఆడకుండా వారికి చెప్పిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 12న నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు, వారి తల్లితండ్రులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో వైస్సార్‌సీపీ వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగమురళి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.