*మొంథా తుఫాను సమయంలో విశేషంగా కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా సేవలు అందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది పనితీరును  ప్రశంసించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పబ్లిక్ హెల్త్ సిబ్బందితో వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో భాగంగా మొంథా తుఫాను సమయంలో విశేషంగా కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా సేవలు అందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది పనితీరును కమిషనర్ ప్రశంసించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా “సైక్లోన్ మొంథా ఫైటర్” అవార్డును నెల్లూరు నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ అందుకోవడం అత్యంత గర్వకారణమని అధికారులు సిబ్బంది కమిషనర్ ను ఘనంగా సన్మానించారు.

శానిటరీ మేస్త్రీలు, సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు వారి వారికి సంబంధించిన ప్రాంతాల నందు ఉన్న కమర్షియల్ కు సంబంధించి ఇప్పటి వరకు గుర్తించని ట్రేడ్ లైసెన్సులు గుర్తించి వారి చేత డబ్బులు జమ చేయించి వాటిని ఆన్లైన్లో పొందుపరచవలసిందిగా ఆదేశించారు. వారి పరిధిలోని ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన వివరములను ఫార్మేట్ రూపంలో పొందుపరిచి వలసినదిగా ఆదేశించారు.

డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. మున్సిపల్ సర్వీసెస్ నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని, ట్రేడ్ లైసెన్సులు చెల్లించని బకాయి దారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి వారు డిసెంబర్ 13వ తేదీన జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ కు హాజరయ్యేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

డ్రైన్ కాలువలలో తొలగించిన మట్టిని 24 గంటలలోపు ఎప్పటికప్పుడు తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఆరోగ్యశాఖ అధికారి కనకాద్రి, వెటర్నరీ డాక్టరు మదన్మోహన్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ జిజియాబాయి, టీ.పి.ఆర్.ఓ వాసు బాబు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *